Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

TASC – Literary Event

By   /  May 17, 2018  /  No Comments

    Print       Email

దక్షిణ కాలిఫోర్నియా లోని తెలుగు మిత్రులకు అభివాదం. మీ అందరికీ ఈ శని వారం, మే 19 వ తేది సాయంత్రం జరుగబోయే ఒక చక్కని సాహితీ, సాంస్కృతిక కార్యక్రమం గురించి ప్రకటన చేస్తూ, పరిచయం చేస్తూ ఆహ్వానం పలుకుతున్నాము .

అష్టావధానం : తెలుగు వారి ప్రాచీన సాహితీ కళ. ఇందులో ఎనిమిది మంది కలసి (వీరిని పృచ్చకులు) ఒక వ్యక్తి ని (అవధాని) ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించే ప్రయత్నం చేస్తారు – వేరు వేరు అంశాలలో వివిధ ప్రశ్నలు అడగడం ద్వారా. కానీ మన అవధానులు సరస్వతీ పుత్రులు, అవధాన క్రియలో ఆరితేరినవారు కాబట్టి , ఆ ప్రశ్నలను సమర్దవంతం గా ఎదుర్కొని వారికి సరియైన సమాధానం సమయస్ఫూర్తి తో చెబుతారు. అయితే – మధ్య మధ్య లో గూగ్లి వేస్తూ వారిని ఆలోచించనీకుండా ఆకతాయి ప్రశ్నలేస్తూ మరొక వ్యక్తి అడ్డు పడుతుంటాడు (అప్రస్తుత ప్రసంగి). అతను చేసే సందర్భంలేని సంభాషణ లో పాలు పంచుకుంటూనే అవధానులు వారికి ఇచ్చిన సమస్య, దత్తపది, వంటి వాటిని పూరిస్తూ ఉంటారు. మొత్తం కార్యక్రమం చివరలో ఒక్కొక్క ఆవృతం లో ఒక్కొక్క పాదం గా చెప్పిన పద్యాలన్నీ ధారణ చేసి నాలుగు పాదాలు చందోబద్దంగా, ఇచ్చిన ఇతివ్రుతానికి తగినట్లుగా పూర్తి చేసి సభికులచే శభాష్ అనిపించుకుంటారు.

InCorpTaxAct
Suvidha

ఈ అవధాన ప్రక్రియ ఇంతకు ముందు మీరు చూసి ఉండకపోతే మీరు ఖచ్చితం గా వచ్చి చూడాలి. మునుపు చూసిన వాళ్ళు తప్పక వస్తారు, ఆ నమ్మకం నాకు ఉంది.

ఒక అవధానితో అవధానం అంటేనే ఎంతో ఆహ్లాదంగా , సంబరం గా ఉంటుంది. అలాంటిది జంట కవులతో అవధానం అంటే రెట్టింపు సంబరం. ఇద్దరు కవులు ఒకరి మనసు ఒకరు అర్ధం చేసుకొని, ఒకరి తో ఒకరు చర్చించకుండా, ఒకటే పద్యాన్ని కొన్ని పాదాలు ఒకరు , మిగతా పాదాలు మరొకరు గా అదే ఛందస్సులో పూర్తి చేయడం మామూలు విషయం కాదు. జంట అవధానం జటిలం గా అనిపిస్తుంది కాని అది మరింత ఆనందాన్ని, తృప్తిని ఇస్తుంది, చేసేవారికి, చూసేవారికి కూడా.
జంట కవులతో అవధానం అంటే అది అంత సులభంగా ఏర్పాటు కాదు. ఇద్దరు అవధానులు అందుబాటు లో ఉండడమే కాకుండా వారిద్దరికీ చక్కని అవగాహన ఉండాలి. అందుకే జంట అవధానాలు చాలా అరుదు.

అటువంటి అరుదైన, అపురూపమైన, అద్భుతమైన కార్యక్రమాన్ని మీకోసం సంయుక్తంగా సమర్పిస్తున్నారు – శివ కామేశ్వరి మందిరం వారు మరియు దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం వారు. ఈ కార్యక్రమానికి తెలుగు సాహితీ ప్రియులు అందరూ వచ్చి, తిలకించి ఆనంద భరితులవుతారని భావిస్తూ ఇదే మీకు మా ఆహ్వానం. వివరాలకు క్రింది ఫ్లయర్ చూడండి.

Contact:

Prasad Rani 
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →