దొందూ..దొందే!
* హోదా కోసం పోరాడని వైసీపీ, టీడీపీ
* సీనియర్ నాయకుడనే బాబుకు మద్దతు ఇచ్చాం
* బాబు, మోడీ ఇద్దరూ మోసం చేశారు
* కాపీలు..టీలు తాగడానికే అఖిలపక్షానికి వెళ్లాం
డెక్కన్ అబ్రాడ్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన నమ్మక ద్రోహానికి నిరసనగా జనసేన, సీపీఎం, సీపీఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించాయి. అన్ని జాతీయ రహదారుల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, లెఫ్ట్ పార్టీల నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసన పాదయాత్ర చేపట్టారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోశారు. అన్యాయాన్ని వివరించేందుకు పాదయాత్ర చేపట్టామన్నారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీ అధినేతలపై మొత్తం మీరు చేశారంటూ మండిపడ్డారు. “హోదా ఉద్యమాన్ని టీడీపీ, వైసీపీ ముందుకు తీసుకెళ్లలేదు. హోదాపై ప్రభుత్వం చాలా ఆలస్యంగా కళ్లు తెరిచింది. విభజనతో నష్టపోయిన ఏపీకి సీనియర్ నాయకుడి అనుభవం కావాలనే తాను గత ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతిచ్చాను. కానీ కొత్త రాష్ట్రానికి చంద్రబాబు అనుభవం ఉపయోగపడలేదు. అందుకే వామక్షాలతో కలసి జనసేన ప్రజా పోరాటాలు చేయాల్సి వస్తోంది. వ్యక్తిగత లాభాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారు. ఒత్తిళ్లకు లొంగి రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షం హోదా ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లలేదు. విరుద్ధ ప్రకటనలతో ప్రజల్ని గందరగోళంలోకి నెట్టారు. అవిశ్వాసం డిమాండ్ జేఎఫ్సీ నుంచే మొదలైంది. అఖిలపక్ష సమావేశాలు సంవత్సరం ముందైనా పెట్టాల్సింది. అఖిలపక్షంలో ఏదో జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. రాజకీయాల కోసమే అఖిల పక్షం ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యూహమేంటో మంత్రుల ద్వారా తెలియజేయాలి. అసలు ఈ టైంలో అఖిలపక్ష భేటీలతో అవసరం లేదు. కాఫీలు, టీలు తాగడానికి అఖిలపక్షానికి వెళ్లం” అని జనసేనాని తేల్చి చెప్పారు.
” రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని, ఏపీకి అన్యాయం చేశారు. ఆస్తులేమో తెలంగాణకి, అప్పులేమో ఆంధ్రకి ఇచ్చారు. విభజన హామీలు నెరవేర్చుతారేమోనని ఎన్నికలు జరిగినఏడాది పాటు వేచి చూశాం. రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేంద్ర ప్రభుత్వంపై మొదటి నుంచి పోరాటం చేయలేకపోయాయి. ఫస్ట్ టైం కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అన్యాయంపై మా పార్టీ సభలో మాట్లాడాను. ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలని చెప్పాను. అయినప్పటికీ ఆ పాచిపోయిన లడ్డూలే కావాలని చంద్రబాబు అన్నారు. ఏపీలో వెనుకబడిన జిల్లాలపై ఎవ్వరూ మాట్లాడడం లేదు” అని పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.