గవర్నర్ ను కాంగ్రెస్, టీడీపీ అవమానించాయి: హరీశ్ రావు
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అయితే గవర్నర్ చేత అన్ని అబద్ధాలు చెప్పించారని విపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వం రాసిచ్చిన దాన్నే గవర్నర్ చదివి వినిపించారని విమర్శించాయి. విపక్షాల విమర్శలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గవర్నర్ ప్రసంగంపై విపక్షాలు విమర్శలు చేయడం సబబు కాదన్నారు. గవర్నర్ ను టీడీపీ, కాంగ్రెస్ అవమానించాయని ఆరోపించారు. విపక్షాల దగ్గర నోరు విప్పి మాట్లాడేందుకు ఏ మాత్రం సరుకు లేదన్నారుు. గత బీఏసీ భేటీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభ్యులు నినాదాలు చేయవద్దని నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్ పార్టీ క్లీన్ బౌల్డ్ అయిందన్నారు. ఏ అంశం మీద చర్చకు అయిన తమ ప్రభుత్వం సిద్ధమేనని ప్రకటించారు. తాము సభలో విపక్షాల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.