Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

TDP faces crisis in Telangana..?

By   /  February 27, 2016  /  Comments Off on TDP faces crisis in Telangana..?

    Print       Email

chandra babu with lokesh

సంక్షోభంలో తెలంగాణ టీడీపీ..?
తెలంగాణలో టీడీపీ పనైపోయిందా..? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ, తెలుగు తమ్ముళ్ల మధ్య ఈ అంశంపైనే జోరుగా చర్చలు సాగుతున్నాయని సమాచారం. తాజాగా తెలంగాణలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే టీడీపీ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ పార్టీ గురించి పట్టించుకోవడం లేదని ఆ పార్టీకి చెందిన నేతల్లోనే ఆందోళన వ్యక్తమవుతోందట. ఇదే జరిగితే పార్టీ పనైపోయినట్లేనని చెవులు కొరుక్కుంటున్నారని సమాచారం.

InCorpTaxAct
Suvidha

నిన్న మొన్నటి వరకు ఏపీలో పాలనా వ్యవహారాల్లో ఎంతలా బిజీగా ఉన్న చంద్రబాబు తెలంగాణలో పార్టీ గురించి కొంత సమయం కేటాయించేవారు. సమయం చిక్కినప్పుడల్లా టీఎస్.టీడీపీ నేతలతో భేటీలు జరుపుతూ వారికి దిశానిర్ధేశం చేసేవారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీపై దృష్టిపెట్టడం లేదని ప్రచారం సాగుతోంది. అసలే విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ వీక్ అయిందని తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా అధికార టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు ఎమ్మెల్యేలు జోరుగా కారెక్కిన సందర్భాలున్నాయి. ఇలాంటి సమయంలో పార్టీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించకపోతే పార్టీకి మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలంగాణ టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారని సమాచారం.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీని అన్నీ తానై నడిపించిన లోకేష్ కూడా ప్రస్తుతం దూరంగా ఉండటం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి కారణం ఆయన ఎన్నికల తర్వాత పార్టీ కార్యాలయాన్ని ఇప్పటివరకు సందర్శించలేదట. ఇప్పటికే పడుతూ లేస్తూ ఉన్న పార్టీని అటు అధినేత.. ఇటు చినబాబు ఇద్దరూ పట్టించుకోకపోతే తెలంగాణలో టీడీపీ పనైపోతుందని ఆ పార్టీ నేతలు, అలాగే రాజకీయ వర్గాల్లో కూడా ముమ్మరంగా చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికైనా పార్టీ ముఖ్య నేతలు తెలంగాణలో క్రియా శీలకంగా వ్యవహరించకపోతే పార్టీ ఉనికే ప్రమాదం ఏర్పడుతుందని అనుకుంటున్నారట.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →