Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

TDP faces troubles in Telangana as MLAs cross over to TRS?

By   /  May 26, 2016  /  Comments Off on TDP faces troubles in Telangana as MLAs cross over to TRS?

    Print       Email

tdpటీఆర్ఎస్ గూటికి త‌మ్ముళ్లు?

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి మ‌రికొంద‌రు టీఆర్ఎస్‌లో చేరుతున్న‌ట్లు గ‌త రెండు రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  ఇప్ప‌టికే కొంత‌మంది టీడీపీ నేత‌లు టీఆర్ఎస్ వాళ్ల‌తో మంత‌నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. దీనికంత‌టికి రాజ్య‌స‌భ సీటు, నామినేటెడ్ ప‌ద‌వులే ముఖ్య‌కార‌ణంగా తెలుస్తోంది. కాగా  టీటీడీపీ నేతలకు రాజ్యసభ సీటు ఇచ్చేది లేదని పార్టీ అధినేత చంద్రబాబు తేల్చి చెప్పినట్లు సమాచారం.  దీంతో గవర్నర్ పదవిపై ఆశలు పెంచుకొని భంగపడి .. చివరకు రాజ్యసభ సీటైనా వస్తుందని ఎదురు చూసిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఈ వార్తతో కంగుతిన్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ సీటు దక్కుతుందనే ఆశతో టీడీపీ నేతలు కొంతకాలంగా పార్టీకి సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నేతలకు రాజ్యసభ సీటు ఇవ్వడం లేదని చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా తేల్చి చెప్పార‌ట‌.

నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడి పదవి కోసం పార్టీ నేతలు ఎల్ రమణ, మోత్కుపల్లి నర్సింహులు, రేవంత్‌రెడ్డి, అరికెల నర్సారెడ్డి, బండారి శోభారాణి పోటీ పడిన విషయం తెలిసిందే. లోకేశ్ బహిరంగ ప్రకటనతో నామినేటెడ్ పదవులు వస్తాయని ఆశించిన నేతల పరిస్థితిపై అగమ్యగోచరంగా మారింది. పదవులను ఆశించి భంగపడ్డ తెలుగు తమ్ముళ్లు టీఆర్‌ఎస్ వైపు చూస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొన‌సాగుతున్న త‌మ‌ను నేటికి గుర్తించ‌డం లేద‌ని, ఇప్పుడు నామినేటెడ్ ప‌ద‌వులు కూడా ఇవ్వ‌కుండా అవ‌మానిస్తున్నార‌ని అందుకే పార్టీ మారేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు కొంత‌మంది తెలంగాణ త‌మ్ముళ్లు బ‌హిరంగంగానే చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →