టీడీపీకి ఆగస్టు సంక్షోభం
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావును 1995 ఆగస్టులో ముఖ్యమంత్రి పదవి నుంచి ఆ పార్టీ సభ్యులే గద్దె దింపారో నాటి నుంచి నేటి వరకు ఆ పార్టీకి ఆగస్టు సంక్షోభం తప్పడం లేదు. ఏటా ఆగస్టులో ఆ పార్టీ ఏదోక విధంగా సంక్షాభాన్ని ఎదుర్కొంటూనే ఉంది. తాజాగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పంలోనే సంక్షోభం వచ్చిపడింది. కుప్పం సర్పంచ్ వెంకటేష్ తీరును నిరసిస్తూ అధికార పార్టీకి చెందిన పంచాయతీ ఉప సర్పంచ్ సుధాకర్‌తోపాటు మరో 15 మంది తమ పదవులకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వీరంతా ఏకంగా కలెక్టర్ సిద్దార్థ జైన్‌ను కలిసి కుప్పం పంచాయతీలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని కూడా ఫిర్యాదు చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుడూ కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సర్పంచ్‌ను కోరుతున్నా పట్టించుకోవడం లేదని, ఏకపక్ష నిర్ణయాలతో నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. తమపై నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి వార్డు సభ్యులుగా గెలిపించినా సర్పంచ్ తీరు కారణంగా వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామని వాపోయారు. ప్రధానంగా డంపింగ్ యార్డు, సిసి రోడ్లు నిర్మాణంలో భారీ స్థాయిలో కుంభకోణం జరిగినట్లు వారు ఆరోపించారు.
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గంలోనే ఆ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పార్టీ నేతలను కలవరపెడుతోంది. ఉప సర్పంచ్ సహా సభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు మీడియాకు వివరణ ఇచ్చారు. కుప్పం పంచాయతీలో సర్పంచ్‌కు, ఇతర వార్డు సభ్యులకు మధ్య నెలకొన్న విభేదాలు చిన్నపాటివేనని కవర్ చేసే ప్రయత్నం చేశారు. వీటిని సామరస్యంగా పరిష్కరిస్తామని అంతా సవ్యంగా జరుగుతుందని తెలిపారు. ఇదిలావుండగా కుప్పం ‘పంచాయతీ’ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లినట్టు సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.