Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

TDP Govt. restricting us inside and outside Assembly: YSRCP Leaders

By   /  March 22, 2017  /  Comments Off on TDP Govt. restricting us inside and outside Assembly: YSRCP Leaders

    Print       Email

ysrcp-logoసభ బయట కూడా మాట్లాడకుండా అడ్డుకుంటున్నారు.. అధికార పక్షంపై విపక్షం ఆరోపణలు..

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏపీ శాసన సభలో వైసీపీ సభ్యులు నినాదాలు, ఆందోళనలు చేపట్టడంపై అధికారపార్టీ సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే టీడీపీ సభ్యులు ప్రజాస్వాయ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని వైసీపీ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు వైసీపీ నేతలు విశ్వేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సభలో మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదని మండిపడ్డారు. సభలోనే కాకుండా బయట కూడా తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు.

తమ పార్టీ మహిళా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లడకుండా అడ్డుపడ్డారని గుర్తు చేశారు. సేమ్ సీన్ ఇవాళ కూడా రిపీట్ అయిందని అన్నారు. తమ సభ్యులు మాట్లాడబోతే మంత్రి పల్లె రఘునాథరెడ్డి అడ్డుపడ్డారని ఆరోపించారు. తమను సభలోనూ, బయట కూడా మాట్లాడకుండా అడ్డుపడితే ఎలా అంటూ ప్రశ్నించారు. తమకు అసెంబ్లీలో ప్రత్యేకంగా మీడియా పాయింట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →