Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

TDP is fighting for AP special status with BJP

By   /  August 5, 2016  /  Comments Off on TDP is fighting for AP special status with BJP

    Print       Email

బీజేపీకి టీడీపీ ప్ర‌చారం

tdp-bjpప్రత్యేక హోదా పోరాటం పేరుతో తాజాగా టీడీపీ చేసిన ఆందోళన విమర్శల పాలవుతోంది. ఏపీలోపి టీడీసీ నాయకులు రోడ్లు ఊడ్చుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. అయితే.. చీపుర్లు పట్టుకుని వారు రోడ్లు ఊడ్చుతుంటే అంతా మోడీ కలల కార్యక్రమం స్వచ్ఛభారత్ ప్రచారం అనుకుంటున్నారే కానీ ప్రత్యేక హోదా కోసం టీడీపీ నిరసన తెలుపుతోందని మాత్రం అనుకోవడం లేదట. ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెస్ – వైసీపీ దీన్ని తమ రాజకీయ పోరాటంగా మలచుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ కూడా టేకప్ చేయాల్సి వచ్చింది. దీంతో ఆ పార్టీ చేస్తున్న ఉద్యమాలు ప్రభావవంతంగా ఉండడం లేదు. పైగా నిరసన పేరుతో బీజేపీ కార్యక్రమాలకు ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. ఈ స్వచ్చభారత్ స్టైలు నిరసన సందర్భంగా టీడీపీ నేత ముద్దు కృష్ణమనాయుడు మాట్లాడుతూ ధర్నాలు – నిరసనలతో హోదా సాధనకోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వివిధ రూపాల్లో ఢిల్లీ వరకు ఆందోళన కొనసాగిస్తామని అన్నారు.
కానీ.. జనమే టీడీపీ నేతలది నిరసన అనుకోవడం లేదు. స్వచ్ఛభారత్ ప్రచారమో లేదంటే ఇంకుడు గుంతలు – వనం మనం లాగా ఇది కూడా కొత్త కార్యక్రమమేమో అనుకుంటున్నారట. సోషల్ మీడియాలోనూ దీనిపై సెటైర్లు ఒక రేంజిలో పడుతున్నాయి. రోడ్లు ఊడిస్తే ప్రత్యేక హోదా వచ్చేస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. కాగా ఒక్క విష‌యం మాత్రం వాస్త‌వం. టీడీపీ నిర‌స‌న బీజేపీకి క‌లిసివ‌స్తోంది. స్వ‌చ్ఛ‌భార‌త్ కార్య‌క్ర‌మానికి ఫ్రీ ప‌బ్లిసిటీ ఇస్తోంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →