జగన్‌ను ఇరుకున పెట్టేందుకు టీడీపీ ప్లాన్
వైయస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ ప్లాన్ వేస్తోందా? జగన్‌ను కోర్టు బోన్‌ను ఎక్కించనుందా? ఇందుకు సంబంధించిన న్యాయ సలహాలు తీసుకుంటోందా? అంటే అవుననే అంటున్నారు టీడీపీకి చెందిన కొంతమంది నాయకులు. టీడీపీని, కోర్టును జగన్ అవమానకరంగా మాట్లాడుతున్నారని అందుకే ఆయనపై కోర్టుకు వెళ్లాలని టీడీపీ నిర్ణయం తీసుకుందట. కాగా ఓటుకు నోటు కేసు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు హైకోర్టు ఏసీబీ కోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చిన నేపథ్యంలో వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, కోర్టును అవమానించే విధంగాఉన్నాయని అంతేకాకుండా సీఎం చంద్రబాబుకు కేసుల నుంచి బైట పడేందుకు మేనేజ్ చేసుకోవటం అలవాటని జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో కూడా జగన్మోహన్రెడ్డి శాసనసభలో కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారని ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ న్యాయవ్యవస్థను కించ పరిచే విధంగా జగన్మోహన్రెడ్డి హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా కోర్టును ఆశ్రయించాలని వ్యూహ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.
వ్యూహా కమిటీ సమావేశం అనంతరం విప్ కూన రవి విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు. మంత్రులు బొజ్జల, రావెల, చీఫ్‌విప్ కాలువ విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాజకీయ కల్లోలం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని, అభివృద్ధి ఆయనకు ఇష్టం లేదని అన్నారు. శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చించేలా సహకరించాలన్నారు. వ్యూహా కమిటీ సమావేశంలో ఈ నెల 8 నుంచి మూడు రోజులపాటు జరిగే శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ప్రత్యేకంగా కరవుపై చర్చించాలని వారు నిర్ణయించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.