Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Tdp leader Revanthreddy fires on Indrakaran Reddy.. Says I am a kid but not an idiot

By   /  February 27, 2017  /  Comments Off on Tdp leader Revanthreddy fires on Indrakaran Reddy.. Says I am a kid but not an idiot

    Print       Email

revanth-reddyనేను బచ్చానే..కానీ లుచ్చాని కాదు..మంత్రి ఇంద్రకరణ్ పై రేవంత్ ఫైర్..

 

InCorpTaxAct
Suvidha

 

 

‘నేను బచ్చానే.. అయితే లుచ్చా’ని మాత్రం కాదు అన్నారు. తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై కేసులు పెడితే భయపడతానని అనుకుంటున్నారని అన్నారు. తాను వేటికి బయపడనని తనకు అన్నీ వెంట్రుకతో సమానమని అన్నారు. పంగనామాలు పెట్టి వేరే పార్టీలోకి వెళ్లిన ఇంద్రకరణ్ రెడ్డికి తనపై విమర్శలు చేసే హక్కు లేదన్నారు.

ఇంద్రకరణ్ రెడ్డి చరిత్ర గురించి తాను నిర్మల్ చెప్పివచ్చానని అన్నారు. దీనిపై తాను చర్చకు రెడీ అంటూ సవాల్ చేశారు. హౌసింగ్ జేవీ ప్రాజెక్టులో పేదలకు చెందిన ఇళ్లను రద్దు చేసి మంత్రి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కేబినేట్ సబ్ కమిటీ నివేదికను బయటపెట్టాలని సూచించారు. హౌసింగ్ శాఖ 17 శాఖలతో జాయింట్ వెంచర్ ఒప్పందాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →