బాబుకు సొంత పార్టీ నేత హెచ్చరిక!
తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారు పేరు అని చెప్పుకుంటుంటారు. అయితే అదంతా గతమని, ఇప్పుడు ఆ క్రమశిక్షణ లేదు.. ఆ నాయతక్వం లేదనిపిస్తోందని ఆ పార్టీలోని నాయకులే చాలా మంది అంటున్నారు. గతంలో బాబు అంటే ఎమ్మెల్యేలు వణికిపోయేవారని, ఇప్పుడు బాబును ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవడం లేదంటున్నారు. అంతేకాదు కొన్ని విషయాల్లో బాబును డిమాండ్ చేయడమే కాదు.. అవసరమైతే బాబుకు హెచ్చరికలు కూడా చేస్తున్నారంటే సీఎం పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. వివరాల్లోకి వెళ్లితే.. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు చంద్రబాబు తీరుపై మండిపడుతున్నారు. తనకు సీఎం తీవ్ర అన్యాయం చేశారని వాపోయారు. తిట్టిన వారికి – విమర్శించిన వారికే చంద్రబాబు పదవులు ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబును తీవ్రంగా తిట్టిన జూపూడి ప్రభాకర్ కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ – కారెం శివాజీకి ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ పదవులు కట్టబెట్టారని… ఎంతోకాలంగా పార్టీ నమ్ముకుని ఉన్న తనకు మాత్రం తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు.
తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వాలని రామారావు డిమాండ్ చేశారు. లేకుంటే డిసెంబర్ 10న విజయవాడలో మాదిగ మేధావుల సదస్సు నిర్వహించి సత్తా ఏమిటో చూపిస్తానని రామారావు హెచ్చరించారు. రామరావు అసంతృప్తి కుల ఉద్యమంగా రూపుదాల్చితే ఇబ్బందేనని టీడీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న చంద్రబాబు నాయుడికి రామారావు ద్వారా మరో తలనొప్పి తెచ్చుకుంటారో్ లేదంటే రామారావును బుజ్జగిస్తారో చూడాలి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.