తమ్ముళ్లలో పెరుగుతున్న అసంతృప్తి
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి దాదాపు రెండేళ్లు అవుతున్నా చంద్రబాబు మాత్రం కార్యకర్తలను సంతృప్తి పరచడంలో విఫలమవుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తమను కాదని.. నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి ప్రియారిటీ ఎక్కువ ఇస్తున్నారని తమ్ముళ్లు మండిపడుతున్నారు. అయతే గతంలో 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం పార్టీనే నమ్ముకుని ఉన్నవారికి ఈసారైనా నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవిస్తారనుకుంటే అది కూడా పార్టీ ఫిరాయించి వచ్చిన వారికే ఇస్తుండడంతో అసలైన తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నమాట అయితే వాస్తవం. ఇప్పటివరకు ఏపీలో మహిళ సహకార ఆర్ధిక సంస్థ చైర్ పర్సన్ గా పంచుమర్తి అనురాధ – ఎస్సీ సహకార ఆర్ధిక సంస్థ చైర్మన్ గా జూపూడి ప్రభాకరరావు – బీసీ సంక్షేమ సహకార ఆర్ధిక సంస్థ బాధ్యతలు పి.రంగనాయకులు – సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎం.లింగారెడ్డి – కాపు సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా చలమల శెట్టి రామానుజయ – వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కు ఎల్ విఎస్ ఆర్ కె ప్రసాద్ – రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ గా వర్ల రామయ్యలు పగ్గాలు చేపట్టారు. రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు ఇవే దక్కాయి.
అయితే ఇంకా మిగిలిన ఉన్న నామినేటెడ్ పదవుల నియామకాలపై ప్రతిష్టంభన కొనసాగించకుండా వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ప్రతిపాదనలు పంపాలని అధినేత చంద్రబాబు నాయుడు నేతలకు సూచించినా కార్యాచరణలో మాత్రం అమలు కావడంలేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత ఏడాది ఇదే నెలలో పార్టీ యువనేత లోకేష్ మాట్లాడుతూ మహానాడు సమయంలోగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. అయితే దాదాపు ఏడాది గడుస్తున్నా నామినేటెడ్ పదవుల భర్తీ ఒక కొలిక్కిరాలేదు. కాగా ఇప్పటికేరెండేళ్లు గడిచి పోయిన తర్వాత ఇప్పుడు నామినెట్ పోస్టులు ఇచ్చి ఏం లాభం అని కొందరు టీడీపీ సభ్యులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అయితే ఈ నామినెటేడ్ పోస్టుల భర్తీ మాత్రం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారిందన్నది అక్షర సత్యం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.