Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

TDP Leadership worried about Mudragada

By   /  June 10, 2016  /  Comments Off on TDP Leadership worried about Mudragada

    Print       Email

babu-mudragadaముద్ర‌గ‌డ‌కు టీడీపీ స‌ర్కార్ భ‌య‌ప‌డుతోందా?

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలుగుదేశం ప్ర‌భుత్వం కాపునాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంను చూసి భ‌య‌ప‌డుతున్నాట్లు క‌నిపిస్తోంది. గ‌త ప‌రిణామాల‌ను, సంఘ‌ట‌న‌లు దృష్టిలోపెట్టుకుని ఈసారి కొంచెం తెలివిగానే వ్య‌వ‌హ‌రించింది. ఉద్య‌మం ఉధృత రూపం దాల్చ‌కుండా ముంద‌స్తు అరెస్టులు చేయిస్తూ ఉధ్య‌మాన్ని నీరుగార్చే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ముద్ర‌గ‌డ ఇంట్లో పురుగుల మందుప‌ట్టుకుని దీక్ష చేస్తున్న త‌రుణంలో పోలీసులు త‌లుపులు బ‌ద్ధ‌లు కొట్టిమ‌రీ ఇంట్లోకి వెళ్లి ముద్ర‌గ‌డ‌ను అరెస్ట్‌చేశారు.  కాగా ముద్ర‌గ‌డ‌ తన ఆందోళనలతో షాకుల మీద షాకులిస్తున్న ఆయన తీరుతో.. ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందన్న ఉద్దేశంతో జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే తుని విధ్వంసకాండలో అరెస్ట్ అయిన నిందితుల్ని విడిచి పెట్టాలని.. కేసులు పెట్టిన వారిపై చర్యలు ఏమీ తీసుకోకుండా ఉండాలన్న డిమాండ్ తో ముద్ర‌గ‌డ ఇంట్లో ఆమరణ దీక్ష షురూ చేసిన సంగతి తెలిసిందే.

తలుపులు బిగించుకొని దీక్ష షురూ చేసిన ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తే.. పురుగుల మందు డబ్బా పట్టుకొని.. తనను అరెస్ట్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటానన్న బెదిరింపుతో వెనక్కి తగ్గారు. తనను లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారన్న ప్రశ్నతో పాటు.. తనపై నమోదు చేసిన కేసుల తాలూకు ఎఫ్ ఐఆర్ కాపీలు చూపించకుండా అదుపులోకి తీసుకోవటాన్ని తాను ఒప్పుకోనన్న ఆయన.. తనను సీఐడీ పోలీసులు మాత్రమే అరెస్ట్ చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా రంగంలోకి దిగిన సీఐడీ పోలీసులు.. గురువారం మధ్యాహ్నానానికే కిర్లంపూడికి చేరుకున్నారు. మీడియాను దూరంగా పంపిన పోలీసులు.. అనంతరం ముద్రగడ అనుచరుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ప‌రిణామాలు అన్నీ చూస్తే బాబు స‌ర్కార్ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంకు భ‌య‌ప‌డుతోంద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని రాజ‌కీయా విశ్లేష‌కులు అంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →