Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

TDP Ministers not happy

By   /  April 22, 2016  /  Comments Off on TDP Ministers not happy

    Print       Email

tdpటీడీపీలో ర్యాంకుల చిచ్చు!

 

InCorpTaxAct
Suvidha

 

 

అసంతృప్తిలో సీనియ‌ర్లు

అలా ఎలా ఇస్తార‌ని అధినేత‌ను నిల‌దీసిన మంత్రులు?

య‌న‌మ‌ల‌కు, కేసీకి అస‌లు ర్యాంకులే ఇవ్వ‌ని వైనం

 

చిలికి చిలికి గాలివాన‌లా మారిన‌ట్లు తెలుగుదేశం పార్టీలో ర్యాంకుల చిచ్చు రాజుకుంది. అది రోజు రోజుకు తీవ్ర‌మ‌వుతోంది. ప‌నిచేసే మంత్రుల‌కు 0 ర్యాంకు ఇచ్చి.. ప‌ని చేయ‌ని మంత్రుల‌కు నెంబ‌ర్ 1 ర్యాంకు ఇవ్వ‌డంపై మంత్రులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అస‌లు మంత్రుల‌కు ర్యాంకులు ఏ ప్రాతిప‌దిక‌న ఇచ్చారో చెప్పాలంటూ సాక్షాత్తు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడునే మంత్రులు నిల‌దీసిన‌ట్లు స‌మాచారం. అయితే ప్ర‌భుత్వంలో చాలా కీల‌కంగా వ్య‌హ‌రిస్తున్న ఆర్థిక శాఖ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడికి, రెవెన్యూ శాఖ మంత్రి కేసీ కృష్ణ‌మూర్తికి అస‌లు ర్యాంకులే ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం మ‌రో విడ్డూరం. కాగా ఎమ్మెల్యేలు నియోజక వర్గాల్లో అందుబాటులో ఉన్న తీరు,వారు మీడియాతో మాట్లాడిన సంఖ్య, పార్టీ శిక్షణ శిబిరాలకు కార్యకర్తలను పంపిన సంఖ్య, ప్రతిపక్షంపై విమర్శలు చేసిన తీరు తదితర అంశాలను  చిన్న‌బాబు లోకేష్ ప్రాతిప‌దిక‌గా తీసుకున్న‌ట్లు స‌మాచారం.

అదేవిధంగా మంత్రులకు వారి నియోజకవర్గాల్లో అందుబాటులో ఉన్న సంఖ్య, జిల్లా ఇన్‌చార్జి మంత్రులుగా వెళ్లిన సందర్భంగా పని తీరు, శాఖలపై సమీక్ష, పర్యటించిన ప్రాంతాల సంఖ్య ఆదారంగా ర్యాంకులు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ర్యాంకులపై మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు, ఆయనను సమర్ధిస్తూ పత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే వాటికి విలువ ఉందా? లేదా అన్న అనుమానం పార్టీ వర్గాల్లో మొదలయింది. నిజంగా, నారాయణ చెప్పినట్లు స్వయంగా చంద్రబాబునాయుడే ర్యాంకులను పట్టించుకోవద్దని చెబితే, ఇక వాటికి విలువ ఏమి ఉంటుందని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ర్యాంకుల చిచ్చును చ‌ల్ల‌ప‌రిచేందుకు సీనియ‌ర్లు రంగంలోకి దిగిన‌ట్లు స‌మాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →