Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

TDP MP Rayapati fires on Central Government about Special Status issue

By   /  February 23, 2018  /  Comments Off on TDP MP Rayapati fires on Central Government about Special Status issue

    Print       Email

కేంద్రంపై టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

 

InCorpTaxAct
Suvidha

 

 

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా ప్రత్యేక ఉద్యమం పైనే చర్చలు కొనసాగుతున్నాయి. విభజన చట్టంలో ఏపికి ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు. అయితే మొన్నటి వరకు కేంద్రం బుజ్జగింపులకు సై అన్న టీడీపి కూడా తిరుగుబాటు బావుట పట్టింది. తాజాగా కేంద్రంపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు హాట్ కామెంట్స్ చేశారు. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఏపీకి కేంద్రం మోసం చేసిందని మండిపడ్డారు. బీజేపీలోనే నేతలకు తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకతలున్నాయని చెప్పారు.

పదవుల రాజీనామాకైనా.. అవిశ్వాసానికైనా తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సాంబశివరావు జగన్‌పైనా మండిపడ్డారు. ఆయన మోకాళ్లపై యాత్ర చేసినా అధికారంలోకి రాలేడన్నారు సాంబశివరావు. ఏపీకి న్యాయం చేయాలని జనసేన అధినేత పవన్ పోరాడుతున్నారని.. ఆయనకు టీడీపీ సహకారం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఓవైపు సంయమనం పాటించాలని చంద్రబాబు చెబుతుంటే.. ఇటు నేతలు మాత్రం మిత్రపక్షంపై మండిపడుతున్నారు. మరి రాయపాటి వ్యాఖ్యలపై టీడీపీ అధినేత ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →