Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

TDP Plan is not working out…..

By   /  August 15, 2016  /  Comments Off on TDP Plan is not working out…..

    Print       Email

tdpబెడిసి కొట్టిన టీడీపీ ప్లాన్‌

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలుగుదేశం పార్టీ వేసిన ప్లాన్ బెడిసికొట్టిందా? చ‌ంద్ర‌బాబుకు ఎదురు దెబ్బ త‌గిలిందా? ఆ విష‌యంలో వైసీపీ స‌క్సెస్ అయిందా? అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. కృష్ణా పుష్క‌రాల‌కు రావాల‌ని ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌ను పిల‌వ‌డానికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మంత్రి రావెల కిశోర్ బాబు, ప్ర‌భుత్వ విప్ కూన ర‌విని పంపిస్తే  జ‌గ‌న్ క‌ల‌వ‌లేద‌ని వెళ్లిన  రావెల కిశోర్ బాబు, ప్ర‌భుత్వ విక్ కూన ర‌వి మీడియాతో చెప్పారు. అయితే ఇదంతా కూడా బాబు చెప్పిన‌ట్లుగానే వారు చెప్పార‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే క‌ల‌వ‌లేద‌నేది అవాస్త‌వ‌మ‌ని, మంత్రికి క‌లిసి జ‌గ‌న్ టీ కూడా తాగార‌ని వైసీపీ అంటోంది. అంతేకాదు జ‌గ‌న్‌ను క‌లిసిన‌ప్ప‌టి ఫోటోను కూడా వైసీపీ బ‌య‌ట పెట్టింది. అంతేకాదు పుష్కరాల ఆహ్వానం విషయంలో ఏపీ అధికారపక్షం తన కుసంస్కారాన్ని ప్రదర్శించిందంటూ.. జగన్ అపాయింట్ మెంట్ కోసం వారం ప్రయత్నించింది లేదని స్పష్టం చేసింది. కాగా జగన్ లాంటి విపక్ష నేతకు ఆహ్వానం ఇవ్వటానికి మరింత ముందేఇచ్చేసి ఉంటే ఒక పని అయిపోయేదిగా అన్న మాట వినిపిస్తోంది. ఏమైనా పుష్కర ఆహ్వానం ఎపిసోడ్ లో మంత్రి రావెల బుక్ అయినట్లుగా చెబుతున్నారు.

జగన్ ఇంటికి వెళ్లి వెయిట్ చేస్తే ఆయన తమను కలవలేదన్న విషయాన్ని చెప్పిన రావెల.. తర్వాతి రోజు ఉదయం (పుష్కరాలు మొదలైన తర్వాత) ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు జగన్ ను కలిసి ఆహ్వానం ఇచ్చి వచ్చామని మాత్రమే రావెల చెప్పారు. ఆహ్వానం ఇవ్వటానికి వెళ్లిన సందర్భంగా జగన్ ఇచ్చిన కాఫీని.. ఆయన సాదరంగా మాట్లాడిన విషయాల్ని బయటకు చెప్పలేదు. జగన్ ఇంట్లో జరిగిన దానికి భిన్నంగా ఆహ్వానం ఇచ్చే విషయంలో తాము ఎన్ని అవస్థలకు గురయ్యామో అన్న భావన వచ్చేలా రావెల మాటలు ఉన్న నేపథ్యంలో జగన్ వర్గం తెర మీదకు వచ్చింది. ఆహ్వానం విషయంలో ఏపీ సర్కారు తప్పుల్ని ఏకరువు పెట్టటంతో పాటు.. ఇంటికి వచ్చిన అతిధికి మర్యాదలు చేసిన విషయాన్ని ప్రస్తావించకపోతే పోయారు.. అందుకు భిన్నంగా తమపై దుష్ప్రచారం మొదలు పెట్టిందంటూ జగన్ వర్గం  తాజాగా తన ఇంటికి వచ్చిన రావెల టీంకు సంబంధించిన ఫోటోను అచ్చేసింది.

తన ఇంటికి వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించినట్లుగా ఉన్న ఫోటోతో జగన్ బ్యాచ్.. ఏపీ అధికారపక్షాన్ని డిఫెన్స్ లో పడేసిన పరిస్థితి. తాజాగా బ‌ట‌కు వ‌చ్చిన ఆ ఫోటోను చూసినప్పుడు పుష్కర ఆహ్వానం కోసం ఏపీ సర్కారు వారం ముందు నుంచి ప్రయత్నించిందన్న భావన కలగకుండా చేయటంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌భ్యులు  సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →