Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

TDP suffers double jolt in Telangana; floor leader, MLA join TRS

By   /  February 11, 2016  /  Comments Off on TDP suffers double jolt in Telangana; floor leader, MLA join TRS

    Print       Email

eraabelli join in trs-aతెలంగాణ టీడీపీకి భారీ షాక్..!

తెలంగాణలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పార్టీ శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. ఎర్రబెల్లితో పాటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా కారెక్కేశారు. టీడీపీకి చెందిన శాసన సభా పక్ష నేత టీఆర్ఎస్ లో చేరడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. అయితే వీరు అధికార పార్టీలో చేరడానికి ముందు బుధవారం రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ బై పోల్ ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ బుధవారం అక్కడకు వెళ్లారు. అక్కడ బహిరంగ సభలో మాట్లాడిన అనంతరం తన మేనల్లుడు మంత్రి హరీశ్ రావును వెంటబెట్టుకుని హైదరాబాద్ వచ్చారు. అనంతరం హరీశ్ రావు.. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు వెళ్ళారు. అప్పటికే అక్కడ ఎర్రబెల్లితో పాటు మరో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా ఉన్నారు. ఇద్దరితో హరీశ్ రావు కాసేపు చర్చలు జరిపారు. తర్వాత అందరూ కలిసి బేగంపేటలోని సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా తాను ప్రకాశ్ గౌడ్ టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఎర్రబెల్లి ప్రకటించారు. సీఎం కేసీఆర్ తో అరగంటపాటు సమావేశం అయిన తర్వాత ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్ మీడియా సమావేశంలో టీఆర్ఎస్ లో చేరినట్లు ప్రకటించారు.

InCorpTaxAct
Suvidha

ఇక.. ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్ ఇద్దరూ కారెక్కేందుకు ముందే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఎర్రబెల్లి టీడీపీకి చెందిన శాసన సభా పక్ష నేత కావడంతో హరీశ్ రావు మర్యాద పూర్వకంగా ఆయన్ను కలిసి.. తన వెంట సీఎం క్యాంపు ఆఫీసుకు తీసుకెళ్ళారని తెలుస్తోంది. ఇదిలాఉండగా.. గతంలో ఒకసారి ఎర్రబెల్లి రాత్రి సమయంలో రహస్యంగా సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్ళి వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం అప్పట్లో మీడియా ద్వారా బహిర్గతమైంది. అప్పటి నుంచి ఆయన కారెక్కనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి తోడు తన నియోజక వర్గంలో మిషన్ కాకతీయ పనుల కోసం సీఎం కేసీఆర్ ను ఆహ్వానిస్తానని ఎర్రబెల్లి ఇటీవలె ప్రకటించారు.ప్రకాశ్ గౌడ్ అయితే ఎప్పటి నుంచో టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం సాగుతోంది. ఆయన ఆ ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చారు. అయితే ఎర్రబెల్లితో కలిసి ఆయన కూడా టీఆర్ఎస్ లో చేరిపోయారు. గడచిన మూడు రోజుల్లో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు కారెక్కడం విశేషం. కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే వివేక్ రీసెంట్ గా అధికార పార్టీలో చేరిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అపూర్వ విజయం సాధించిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు..అధికార పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →