సొంత సర్వేలోనే బాబుకు మైనస్ మార్కులు
“ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై రాష్ట్రంలో రోజురోజుకు ప్రజా వ్యతిరేకత ఎక్కువవుతోంది. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు సమాధానం చెప్పుకోలేకపోతోంది. బాబు హామీలను నెరవేర్చడం లేదని ప్రతిపక్ష నేత చేస్తున్న ఆరోపణనలను ప్రజలు నమ్ముతున్నారు.“ ఇదంతా ఎవరో చెప్పింది కాదు. చంద్రబాబు నాయుడు స్వయంగా ఏర్పాటు చేసుకున్న టీడీపీ నాలెడ్జ్ సెంటర్ ఇచ్చిన రిపోర్టు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ రిపోర్టు ఇచ్చిన వివరాలిలా ఉన్నాయి. “ ఏపీలో లోటు బడ్జెట్ ఉందని చెప్తూనే బాబు దుబారా చేస్తున్నారంటూ వస్తున్న విమర్శలను ఖండించడంలో నేతలు – మంత్రులు వెనుకబడి ఉన్నారని పేర్కొంది. దానితోపాటు ఓటుకునోటు కేసు భయంతో అటు కేంద్రం – ఇటు కేసీఆర్ తో బాబు మెతకగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపైనా నేతలు స్పందించడం లేదని స్పష్టం చేసింది. బాబు నోరు తెరిస్తే అబద్ధాలాడుతున్నారని పాలనంతా మోసం అని రోజూ జగన్ చేసే ప్రచారంపైనా తగినరీతిలో ప్రతి విమర్శలు చేయడం లేదని గుర్తించింది. మేనిఫెస్టో హామీలేవీ అమలు కావడం లేదని తెలంగాణలో టీడీపీ కనుమరుగవుతుందన్న విమర్శలతోపాటు.. రైతు – డ్వాక్రా రుణమాఫీ హామీలో బాబు మోసం చేశారన్న ఆరోపణలను ఖండించి తగిన సమాచారం ఇచ్చి సానుకూల ప్రచారం చేయటంలో విఫలమయ్యామని నాయకత్వానికి నివేదిక ఇచ్చింది.
రైతు రుణమాఫీకి వైఎస్ తన హయాంలో ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాలకు 1004 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగా బాబు 13 జిల్లాలకు ఇప్పటికే 8 వేల కోట్లు ఖర్చుపెట్టారన్న వాస్తవాన్ని రైతులకు చేర్చడంలో వెనుకబడినట్లు నాయకత్వానికి నివేదిక సమర్పించింది. వైఎస్ పెట్టిన ఖర్చులకు ఫలితాలు రాలేదని బాబు పెట్టిన ఖర్చులకు వేలకోట్ల పెట్టుబడులు వచ్చాయన్న విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోలేకపోయామని పేర్కొంది. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ అన్ని హామీలూ నెరవేరుస్తున్నా – వాటికి తగిన స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోతున్నామని పేర్కొంది.“ అయితే రిపోర్టు చూసి ఖంగుతిన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.