Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

TDP-TRS looking for increase in number of seats in Telangana & AP state

By   /  July 28, 2016  /  Comments Off on TDP-TRS looking for increase in number of seats in Telangana & AP state

    Print       Email

tdpఅసెంబ్లీ సీట్ల పెంపు లేదు

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదని, ఇందుకు రాజ్యాంగం నిబంధనలు ఒప్పుకోవని కేంద్ర చెప్పడంతో ఒక్క సారిగా రాజకీయ నాయకులలో నిస్తేజం ఆవహించింది. సీట్ల సంఖ్య పెంచాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరని పేర్కొంది. ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు అంశంపై తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు టి. దేవేందర్‌గౌడ్ రాజ్యసభలో ప్రశ్న అడిగారు. సీట్ల సంఖ్య పెంపుపై న్యాయ శాఖ, అటార్నీ జనరల్ అభిప్రాయాలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ స్పందిస్తూ.. ఈ అంశంపై అటార్నీ జనరల్ అభిప్రాయా లను న్యాయశాఖ తీసుకుందని చెప్పారు. విభజన చట్టం సెక్షన్-26కు సవరణ చేసినా ఆర్టికల్ 170కి సవరణ చేయాలా? అని అడిగినట్లు తెలిపారు. సెక్షన్-26కు సవరణ చేసినా సీట్ల పెంపు సాధ్యం కాదని, ఆర్టికల్ 170 ప్రకారం ఇప్పటికప్పుడు సీట్ల పెంపు సాధ్యం కాదని అటార్నీ జనరల్ స్పష్టం చేసినట్లు వెల్లడించారు.

సీట్ల పెంపు చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. రాజ్యసభలో మంత్రి ఇచ్చిన సమాధానంతో తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒకేవేళ నియోజక వర్గాలు పెంచాలని నిర్ణయిస్తే రాజ్యాంగ సవరణ అవసరమని అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. అయితే అది ఈ రాజకీయ నేపథ్యంలో సాధ్యం కాని విషయం. కానీ విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లను పెంచాలని రెండు ప్రభుత్వాల అధినేతలు కోరుతున్నారు. ఏపీ విభజన చట్టంలో అవసరం మేరకు నియోజకవర్గాలను పెంచుకోవచ్చని పేర్కొన్నప్పటికీ 2026 వరకూ నియోజకవర్గాల పునర్విభజన కుదరదంటూ ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. నియోజక వర్గాల పెంపుని సాకుగా చూపి ఏపీలో టీడీపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రంలో విపక్షాన్ని లేకుండా చేసే ఉద్దేశంతో అధికార పార్టీ ‘ఆపరేషన్ ఆకర్ష్’ కు తెరలేపారు.

పార్టీలోకి వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవద్దంటూ అధికార పార్టీకి చెందిన ఆయా నియోజక వర్గాల్లోని కార్యకర్తలు పలు సందర్భాల్లో వ్యతిరేకించారు. అయితే వ్యతిరేకించిన ఆయా నియోజక వర్గ నేతలకు, కార్యకర్తలకు పార్టీ అధిష్టానం చెప్పిన మాట 2019 నాటికి ఏపీలో అసెంబ్లీ నియోజక వర్గాల పెంపు ఉంటుందని, అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పడంతో వారు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకునేందుకు అంగీకరించారు. అయితే తాజాగా 2026 నాటికి నియోజకవర్గాల పెంపు ఉండబోదని కేంద్రం తేల్చి చెప్పిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయించిన రాజకీయ నాయకుల పరిస్థితి ఏమవుతుందో వేచి చూడాల్సిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →