Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

TDP will come to pwoer: JC Diwakar Reddy

By   /  April 13, 2018  /  Comments Off on TDP will come to pwoer: JC Diwakar Reddy

    Print       Email

మ‌ళ్లీ బాబే సీఎం..జేసీ జోస్యం

InCorpTaxAct
Suvidha

 

 

 

* ఇప్ప‌టికీ చెబుతున్నా హోదా రాదు

* బాబు మ‌ళ్లీ సీఎం అయ్యాక మోడీ ప‌నిప‌డ‌తాం

* టీడీపీ స‌త్తా ఏంటో ఢిల్లీకి చూపిస్తాం

* మీడియా స‌మావేశంలో ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి

డెక్క‌న్ అబ్రాడ్‌: అనంత‌పురం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ఏం మాట్లాడినా అది సంచ‌ల‌న‌మే. వివాద స్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంలో కానీ.. వ్యంగ్యాస్త్రాలు సంధించ‌డంలో కానీ ఆయ‌న దిట్ట‌. మొన్న ఢిల్లీనుంచి వ‌చ్చిన జేసీ ఎయిర్‌పోర్టులో దిగంగానే “వెంట‌నే బ‌స్సు యాత్ర‌లు అంటే ఎట్టా?  మాకూ పెళ్లాం పిల్ల‌లు ఉన్నారు క‌దా.. మీరు మాత్రం బాగుండాలా?  మేం మాత్రం రోడ్లు ప‌ట్టుకుని తిర‌గాలా?“ అంటూ మీడియావాళ్ల‌ను ప్ర‌శ్నించి వార్త‌ల్లో నిలిచిన జేసీ తాజాగా మ‌ళ్లీ బాబే సీఎం కావ‌డం.. ఈసారి మోడీ ప‌ని ప‌ట్ట‌డం ఖాయం అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అనంత‌పురంలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో జేసీ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించడం ఖాయమ‌న్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ సీఎం చంద్రబాబే అంటే జోస్యం చెప్పరు. ప్రత్యేక హోదాపై స్పందిస్తూ.. ప్రధాని మోదీపై మరోసారి విరుచుకుపడ్డారాయన.

తాను మొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదనే చెప్తున్నానని.. ఈ విషయంలో ప్రధాని మొండి వైఖరి తనకు ఎప్పుడో అర్థమైందన్నారు. ఇకపై కూడా ఏపీకి మోదీ ఏం చేయరని.. రానున్న ఎన్నికల్ని ఆయధంగా చేసుకుని ఓటుతో తెలుగు ప్రజల సత్తా ఏంటో మోడీకి చూపించాలన్నారు. ఈ సందర్భంగా 2019 ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం లోకి రావటం ఖాయం అని.. మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబే అన్నారు. ఐనా ప్రజలు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే మంచిదన్నారు. చంద్రబాబు సీఎం అయిన తరువాత తెలుగు ప్రజల సత్తా ఏంటో చూపిస్తామని.. మోడీ పనిపడతాం అంటూ జేసీ హెచ్చ‌రించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

NATA Atlanta Summber Camp & Art Exhibition a grand success – 400 plus new life members to NATA Family

Read More →