కోహ్లీ కఠోర సాధన!
వరుస రికార్డులతో దూసుకుపోతున్నారు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఫిట్నెస్ ఉంటేనే ఎందులోనైనా రాణించగలమంటున్నారు. అందుకే కోహ్లీ కూడా కఠోరమైన సాధనను చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. తన ఫామ్ మెరుగుపడటానికి ఫిట్నెస్ కారణమంటున్నఈ క్రికెటర్ ఎక్కువ సేపు జిమ్‌లలోనే గడిపేస్తున్నాడు. వెయిట్ లిఫ్టింగ్‌తో సరికొత్త సాధన చేస్తున్నాడు. ఇరువైపులా 10 కిలోల బరువున్న బార్లను వేసుకుని వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్ సైజ్ చేస్తున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో డబుల్ సెంచరీతో సరికొత్త రికార్డు సృష్టించిన కోహ్లి..రెండో టెస్టు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆ జిమ్‌లో వెయిట్ లిఫ్టింగ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జూలై 30 వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య సబినా పార్క్ లో రెండో టెస్టు ఆరంభం కానుంది.
మొదటి టెస్టులో విండీస్ కు చుక్కలు చూపించిన కోహ్లి.. రెండో టెస్టులో ఆతిథ్య జట్టును ఎలా ఆడుకుంటాడో చూడాలి మరి. ఇదిలా ఉంటే టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే కూడా క్రికెటర్లకు యోగా నేర్చిస్తున్నాడు. యోగాతో చాలా ఉపయోగాలు ఉన్నాయని తప్పకుండా రోజూ యోగా చేయాలని సూచిస్తున్నారట. మొత్తానికి మనవాళ్లు ఫిట్‌నెస్‌పై ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.