టీమిండియా దూకుడు!
వెస్టిండిస్ గడ్డపై టీమిండియా ఆటగాళ్లు చెలరేగిపోతున్నారు. బ్యాటింగ్లోను, బౌలింగ్‌లోనూ రాణిస్తున్నారు. అంతేకాదు వెస్టిండిస్ ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు. సొంతగడ్డపై తామే గెలుస్తామని ధీమాగా ఉన్న వెస్టిండిస్ టీం ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. రెండో టెస్టులోనూ భారత జట్టు పట్టు బిగించింది. రహానే సెంచరీ( 237 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు)తో చెలరేగడంతో భారత్ మ్యాచ్‌ను శాసించే స్థాయికి చేరింది. 9 వికెట్లు కోల్పోయిన భారత్ 500 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. 304 పరుగుల ఆధిక్యంలో భారత్ ఉంది. మూడవ రోజు వరుణుడు అడ్డుపడటంతో ఆటకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆటను ముగిస్తున్నట్లు అంపెర్లు ప్రకటించారు. ఓవర్‌నైట్ స్కోరు 358/5తో ఇన్నింగ్స్ కొనసాగించిన రహానే, సాహా (47)తో కలిసి ఆరో వికెట్‌కు 98 పరుగులు జోడించారు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన అమిత్ మిశ్రా 21 పరుగులు చేయగా, షమి డకౌట్ అయ్యాడు. రహానే టెస్టుల్లో ఆరో సెంచరీని నమోదు చేశాడు.
దూకుడుగా ఆడిన ఉమేష్ యాదవ్ 14 బంతుల్లో 19 పరుగులు చేసి చేజ్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో కెప్టెన్ కోహ్లీ డిక్లేర్డ్ చేశాడు. రహానే 108 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కాని అప్పటికీ మూడో రోజు మ్యాచ్ ఆడేందుకు రెండు గంటల సమయం ఉన్నప్పటికీ వర్షం తగ్గకపోవడంతో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించలేకపోయింది. వెస్టిండీస్ బౌలర్లో చేజ్ 5 వికెట్లు, బిషూ, హోల్డర్, గాబ్రియెల్ తలో వికెట్ తీశారు. మిగతా రెండు రోజుల్లో వెస్టిండీస్‌ను ఆలౌట్ చేస్తే నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2/0 ఆధిక్యంలో నిలువనుంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.