రాణించిన టీమిండియా ఆటగాళ్లు..
హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్ నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ప్లేయర్లు రాణించారు. ముందుగా బ్యాటింగ్ కుర్రాళ్లు సత్తా చాటారు. 32 పరగుల లక్ష్యాన్ని సాధించి తర్వాత బౌలింగ్ లో కూడా సత్తా చాటారు. ఆసీస్ టాప్ ఆర్డర్ కు షాక్ ఇచ్చారు. ఇక టీమిండియాను కట్టడి చేసేందుకు ఆసీస్ ఐదుగురు బౌలర్లను రంగంలోకి దింపింది. ఇక భారత్ కూడా కుల్ దీప్ యాదవ్ ను వ్యూహాత్మకంగా తీసుకొచ్చింది.
దీంతో ఇరు జట్లు బౌలింగ్ నే నమ్ముకుని బరిలోకి దిగాయి. అయితే ఫస్ట్ డే ఆసీస్ పై పై చేయి సాధించి 301 రన్స్ కే కట్టడి చేశారు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన టీమిండయా ఆసీస్ కు గట్టిపోటీ ఇచ్చింది. దీంతో టీమిండియా 32 పరుగుల ఆధిక్యంలోకి చేరింది. అయితే తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఆసీస్ బ్యాట్స్ మెన్ ను భారత బౌలర్లు కట్టడి చేశారు.
టాప్ ఆర్డర్ కు షాకుల మీద షాకులు ఇచ్చారు. ఆసీస్ రెన్ షా (8), వార్నర్ (8) సింగిల్ డిజిట్ కే అవుటయ్యారు. ఇక స్మిత్ (17), హ్యాండ్స్ కోంబ్ (18) , మ్యాక్స్ వెల్ (45) కాస్తంత నిలకడగా ఆడారు. అయితే షాన్ మార్ష్ (1)కే అవుట్ అయ్యాడు.తర్వాత కుమ్మిన్స్ (12), ఒకీఫ్ (0), లియాన్ (0) ను బౌలర్లు పెవిలియన్ కు పంపించారు. అలాగే హాజిల్ వుడ్ (0) అండగా మాథ్యూ వేడ్ (25) నిలబడ్డాడు.
చివరకు ఆసీస్ 53.5 ఓవర్లకు ఆసీస్ 137 రన్స్ దగ్గర ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో మూడేసి వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీశాడు. దీంతో ఆసీస్, టీమిండియాకు 106 రన్స్ ని టార్గెట్ గా ఇచ్చింది. అయితే రెండు రోజుల ఆట ఇంకా మిగిలి ఉంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.