క్లీన్ స్వీప్
యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా అనుకున్నది సాధించింది. వరుసగా మూడో వన్డేలోనూ ఘన విజయంతో సిరీ్‌సను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. పేసర్ జస్ప్రీత బుమ్రా (4/22) నిప్పులు చెరిగే బౌలింగ్‌కు తోడు ఓపెనర్లు లోకేశ్ రాహుల్ (63 నాటౌట్), ఫయాజ్ ఫజల్ (55 నాటౌట్) అజేయ అర్ధ శతకాలతో చెలరేగడంతో బుధవారం జరిగిన చివరి, మూడో వన్డేలో భారత పది వికెట్లతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. ధోనీసేన బౌలింగ్ దెబ్బకు 42.2 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. సిబంద (38), చిబాబ (27) మాత్ర మే ఫర్వాలేదనిపించాడు. బుమ్రా అండ్ కో దెబ్బకు జట్టులో ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ బాట పట్టారు. స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ రెండు, కులకర్ణి, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు. లోకేశ్ రాహుల్‌తో పాటు అరంగేట్రం ఆటగాడు ఫయాజ్ ఫజల్ హాఫ్ సెంచరీతో కదం తొక్కడంతో భారత్ కేవలం 21.5 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. లోకేశ్ రాహుల్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. ఈ విజయంతో జింబాబ్వేపై భారత వైట్వా్షల హ్యాట్రిక్ నమోదు చేసింది. 2013, 2015లో ఇక్కడ పర్యటించిన భారత ఐదు వన్డేల సిరీ్‌సను 5-0తో, మూడు వన్డేల సిరీ్‌సను 3-0తో దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇరు జట్ల మధ్య మూడు టి-20ల సిరీ్‌సలో భాగంగా ఆదివారం ఇదే వేదికపై మొదటి మ్యాచ్ జరగనుంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.