భారత్ – పాక్ మ్యాచ్ లో ఆటగాళ్ళపై తీవ్ర ఒత్తిడి..
పాక్ తో మ్యాచ్ అంటే టీమిండియా ప్లేయర్లు సింహాల బరిలో దిగుతారు. ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్యాట్ కు పనిచెబుతారు. అలాంటిది ఈ సారి జట్టుపై తీవ్ర ఒత్తిడి ఉంది. శనివారం పాక్ తో జరగనున్న మ్యాచ్ భారత ఆటగాళ్ళకు సవాల్ లా పరిణమిస్తోంది. వరల్డ్ కప్ లో హాట్ ఫేవరేట్ గా బరిలో దిగిన టీమిండియా.. అనుకోని రీతిలో కివీస్ చేతిలో పరాజయం పాలైంది. ఇక పాక్ అయితే బంగ్లాను చిత్తు చిత్తుగా ఓడించింది. దీంతో ఆ జట్టు మంచి ఆత్మ విశ్వాసంతో ఉంది.పాక్ బ్యాట్స్ మెన్, బౌలర్లు కూడా రాణించారు. ఓవరాల్ పాక్ టీమ్ ఓ ట్రాక్ లోకి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పాక్ బౌలింగ్ ను ఎదుర్కోవడం భారత జట్టుకు సవాల్ లా మారింది. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో భారత బ్యాట్స్ మెన్ ఎలా బ్యాట్లు ఎత్తేశారో అందరికి తెలిసిన విషయమే.
ఇక దాయాది దేశంతో మ్యాచ్ భారత్ కు ఎంతో కీలకమైంది. ఈ మ్యాచ్ లో ఓడితే ఇంచుమించుగా భారత్ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినట్లే అవుతుంది. అయితే ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ ను ఓడించినా కొంత వరకు అవకాశాలుంటాయి. అయితే దానికి అన్ని రకాల సమీకరణలు కూడా సహకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పాక్ ను ఎదుర్కోవడం భారత్ కష్టమైన పనేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. పాక్ , ఇండియా మ్యాచ్ జరగనున్న ఈడెన్ గార్డెన్స్ లో భారత్ కు గుడ్ రికార్డ్ లేదు. ఇక్కడ జరిగిన మ్యాచ్ లలో నాలుగింటిని పాక్ పై భారత్ ఓడిపోయింది. ఇక రేపటికి హాట్ ఫేవరేట్ గా పాక్ బరిలో నిలుస్తోంది. మరి భారత జట్టు శక్తి వంచన లేకుండా కృషి చేస్తే తప్ప గండం నుంచి గట్టెక్కడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.