Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Team India is thinking of white-wash

By   /  June 15, 2016  /  Comments Off on Team India is thinking of white-wash

    Print       Email

Ms-dhoni5వైట్‌వాష్ చేసే యోచ‌న‌లో భార‌త్‌

 

InCorpTaxAct
Suvidha

 

అంతర్జాతీయ క్రికెట్‌లో అపార నాయకత్వ అనుభవమున్న ధోనీ..కుర్రాళ్లలో ఎనలేని ఆత్మవిశ్వాసం నింపాడు. ఫలితంగా అరంగేట్రం వన్డేలోనే రాహుల్ సెంచరీ, బుమ్రా, చాహల్ బౌలింగ్ విజృంభణ, రాయుడు సాధికారిక ఇన్నింగ్స్ వెరసి మరో వన్డే మిగిలుండానే టీమ్‌ఇండియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న ధోనీసేన ఆఖరి మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ప్రయోగాలకు పెద్దపీటవేస్తూ కొత్త ఆటగాళ్లకు అవకాశమిచ్చే సూచనలున్నాయి. జింబాబ్వేతో సిరీస్‌కు ముందు ధోనీకి సవాలు ఎదురుకాబోతున్నదని విశ్లేషకులు భావించారు.కానీ టీం ఇండియా కుర్రాళ్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. సీనియర్ల గైర్హాజరీలో తమకు దక్కిన అవకాశాలను ఒడిసిపట్టుకుంటూ జట్టు విజయాల్లో కీలకమవుతున్నారు. దీనికి రెండు వన్డేల్లో టీమ్‌ఇండియా సాధించిన ఘనవిజయాలే నిలువుటద్దం. కాగా జింబాబ్వే గడ్డపై టీమ్‌ఇండియాది అప్రతిహత విజయపరంపర. 2013, 15లో అక్కడ పర్యటించిన భారత్..జింబాబ్వేను వైట్‌వాష్ చేసింది. ఇప్పుడు గత చరిత్రను పునరావృతం చేసే ఆలోచ‌న‌లో టీంఇండియా ఉంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →