Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక రానుందా?

By   /  July 14, 2016  /  Comments Off on తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక రానుందా?

    Print       Email

Telanganaటీఆర్ఎస్ పార్టీ మ‌రో ఉప ఎన్నిక‌కు సిద్ధ‌మ‌వుతోందా? త‌్వ‌ర‌లో అధికారిక ప్ర‌క‌ట‌న రాబోతుందా? మాజీ ఉప ముఖ్య‌మంత్రి చెప్పింది నిజం కాబోతుందా? అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అస‌లు విష‌య‌మేమిటంటే…పటాన్ చెరు పరిధి పాశమైలారంలోని ఓ పరిశ్రమలో 2014లో జ‌రిగిన సంఘ‌ట‌న‌లో ప్రమాదవశాత్తూ ఓ కార్మికుడు చనిపోయాడు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలంటూ ప్ర‌స్తుత ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి యాజ‌మాన్యంతో మాట్లాడ‌గా…వారు రూ.15ల‌క్ష‌ల ప‌రిహారం ఇచ్చారు. అయితే ఆ ప‌రిహారం పొందిన మ‌ధ్య‌వ‌ర్తితో మాట్లాడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే త‌న వాటా కోసం డిమాండ్ చేయ‌డ‌మే కాకుండా ఆయ‌న‌పై దాడి చేసినట్లు కేసు నమోదైంది. ఈ కేసు విచారించిన మెజిస్ట్రేట్ దుర్గాప్రసాద్ మహీపాల్ రెడ్డిని దోషిగా నిర్ధారిస్తూ  రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఇటీవ‌ల తీర్పు ఇచ్చారు.

అయితే పై కోర్టులో అప్పీలుకు అవ‌కాశం ఇచ్చారు. త్వ‌ర‌లో ఈ తీర్పు వ‌స్తుంద‌ని భావిస్తున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప ముఖ్య‌మంత్రి  దామోద‌ర రాజ‌న‌ర్సింహ వ్యాఖ్య‌లు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. మెదక్‌ జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ స్థాయి సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దామోద‌ర కాంగ్రెస్‌ పార్టీలో పదవులు అనుభవించి స్వార్థంతో టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన భూపాల్‌రెడ్డి వంటి వారు నమ్మకద్రోహులని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీకి నాయకులు అవసరం లేదని, పార్టీ గుర్తే తమకు పెద్ద నాయకుడని చెప్పారు.  పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ విజయం ఖాయమని జోస్యం చెప్ప‌డం విశేషం.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →