Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telangana Assembly Update

By   /  March 12, 2016  /  Comments Off on Telangana Assembly Update

    Print       Email

etela rajender

ఏడాదిలోగా ఉద్యోగాల భర్తీ: మంత్రి ఈటెల..

InCorpTaxAct
Suvidha

 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగాయి. కరువు నివారణ, ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్‌, వామపక్షాలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అనంతరం గవర్నర్ ప్రసంగం ధన్యవాదాలు తీర్మానంపై చర్చ చేపట్టారు.

 

కాంగ్రెస్ సభ్యుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ..
తన నియోజక వర్గంలో 25 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కాంగ్రెస్ సభ్యుడు చిట్టెం రామ్మోహన్ నాయుడు అన్నారు. వ్యవసాయం కోసం బయటి నుంచి అప్పులు తెచ్చి పంట దిగుబడి రాకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఒకేసారి రుణమాఫీ చేస్తే రైతులు బాగుపడతారని సూచించారు. సర్కారు రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు.

 

టీడీపీ నేత ఆర్.కృష్ణయ్య

తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.తక్షణం ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టెట్ తో సంబంధం లేకుండా డీఎస్సీ నిర్వహించాలని సూచించారు. టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎక్కడైనా ఆ పోస్టులు ఖాళీ అయితే ఆరు నెలల్లో భర్తీ చేసేలా చట్టం చేయాలన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారన్నారు.

 

కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి..
టీఎస్ పీసీ ద్వారా ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. 14, 789 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామనడం సిగ్గుచేటని మండిపడ్డారు.
ఏడాదిలోగా అన్ని పోస్టులు భర్తీ : ఈటెల
రాష్ట్రంలో 7 లక్షల 744 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. 14,789 ఉద్యోగాలకు రిక్రూట్ మెంట్ జరుగుతోందన్నారు. ఏడాదిలోగా అన్ని పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకం విషయంలో రాజీపడబోమన్నారు. శాఖల వారిగా అన్ని పోస్టులను ఖచ్చితంగా భర్తీ చేస్తామన్నారు. కాంగ్రెస్ నేతలకు ప్రజల పై ప్రేమ లేదని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలో రిక్రూట్ మెంట్ ఎందుకు చేయాలేదో చెప్పాలన్నారు.

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →