Loading...
You are here:  Home  >  Business News  >  Current Article

Telangana Chief Minister KCR recently experiencing set backs

By   /  July 28, 2016  /  Comments Off on Telangana Chief Minister KCR recently experiencing set backs

    Print       Email

2014-12-10_192127_KCR_HYdకేసీఆర్ దూకుడుకు వ‌రుస అడ్డంకులు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి పాల‌న‌లో దూకుడు కొన‌సాగిస్తూ వెళ్తున్నారు. ఆయ‌న ఏది అనుకుంటే అది అలా చేసుకుంటూ పోతున్నారు. అయితే ఇటీవ‌ల ఎందుకో కొన్ని ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ముఖంగా మ‌ల్ల‌న్న సాగ‌ర్  ప్రాజెక్టు అంశం ప్రభుత్వానికి పెను సవాల్ గా మారింది. ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు ఎంసెట్ పరీక్ష పేపర్ల లీకేజి అంశం కూడా ప్రభుత్వానికి మచ్చ తెచ్చింది. అంతేకాదు మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డట్లు యూనివర్సిటీల ఉప కులపతుల నియామకంపైనా హైకోర్టు ఆగ్రహించి ప్రభుత్వం చేపట్టిన వీసీల నియామకం చెల్లదంటూ రద్దు చేసింది. దీంతో వరుస దెబ్బలతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాగా రెండు రోజుల కిందట తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఎనిమిది మంది వీసీల నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు గురువారం ఆదేశాలు ఇచ్చింది.  వీసీల నియామకంపై న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే ప్రభుత్వం కొత్తగా 8 మందిని నియమించడాన్ని కోర్టు సీరియస్ గా తీసుకుంది.

InCorpTaxAct
Suvidha

తొలుత ఆ నియామకాలను రద్దు చేసి కేసు నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. రాజకీయంగా దూకుడుగా వెళ్తున్న కేసీఆర్ కోర్టులో ఉన్న ఈ వ్యవహారంలోనూ దూకుడు చూపించి దెబ్బయిపోయారు. ఇప్పటికే కేసీఆర్ సర్కారును రెండు వారాలుగా మల్లన్నసాగర్ ఆందోళన – ఎంసెట్ పేపర్ లీకేజీల రూపంలో వరుస సమస్యలు – వివాదాలు కుదిపేస్తున్నాయి. మల్లన్నసాగర్ భూనిర్వాసితుల ఆందోళనతో ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోరాడుతున్నాయి. ఇది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఒకరకంగా ఈ విషయంలో ప్రతిపక్షాలు ప్రజల మద్దతు కూడగట్టగలిగాయి. భూనిర్వాసితుల పోరాటానికి క్రమంగా ప్రతిపక్షాల మద్దతు పెరుగుతుండటం ప్రభుత్వంలో ఆందోళన పెరుగుతోంది.  వీరికితోడుగా స్వచ్ఛంద సంస్థలు – మేధావులు కూడా భూనిర్వాసితులకు మద్దతు పలుకుతుండటంతో ప్రభుత్వం తల పట్టుకుంటోంది.

తాజాగా ఎంసెట్ -2 పేపర్ లీకేజీ వ్యవహారం ప్రభుత్వానికి మరో తలనొప్పిగా మారింది.  ఈ వ్యవహారంలో రంగంలోకి దిగన సీఐడీ అధికారులు నిందితులను పట్టుకున్నారు.. అయితే  ఎంసెట్ -2 పరీక్షను రద్దు చేయాలా? వద్దా? అన్న విషయంలో ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది.  72 మందికి పేపర్ లీక్ అయిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేవలం వీరిపైనే చర్యలు తీసుకోవాలని మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కాదు కాదు.. మొత్తం పరీక్ష రద్దు చేయాలని.. నిపుణులు – మేధావులు సూచిస్తున్నారు.  ఇలా వ‌రుస దెబ్బ‌ల‌తో కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →