Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telangana Ghazal – poetry

By   /  May 13, 2016  /  No Comments

    Print       Email

13179232_893758010752221_2431758268244428907_nవెన్నెలమ్మ తన గూటికి రమ్మన్నది మౌనముగా..!
మల్లెలమ్మ మాటాడక ముద్దన్నది మౌనముగా..!

గాలికేమి తెలియదనెను పరిమళించు ముచ్చటలే..!
మబ్బులమ్మ పరుగెడుతూ మెరుపన్నది మౌనముగా..!

InCorpTaxAct
Suvidha

నీరేమో గలగలమను సవ్వడితో ఊసులాడె..!
చినుకులమ్మ జారిపోతు సిగ్గన్నది మౌనముగా..!

నిప్పేమో మంచుకొండ తానయ్యెను గుండెలోనె..!
కోకిలమ్మ వేగిపోతు పాడన్నది మౌనముగా..!

ఆకాశం స్వాగతాల తెర పట్టెను అందాలకు..!
కోనలమ్మ కణకణమున ఆడన్నది మౌనముగా..!\

దినకరునకు లేని గొడవ మనకేలనొ ప్రతి ఉదయం..!
తలపులమ్మ ‘మాధవుడా’ చూడన్నది మౌనముగా..!

 

Source: Madhav Rao Koruprolu

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →