తెలంగాణకు ఫస్ట్ ర్యాంక్
దేశ వ్యాప్తంగా కానీ.. రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఏ అంశపైనా సర్వే చేసినా అందులో తెలంగాణ రాష్ట్రం టాప్లో నిలుస్తోంది. తెలంగాణ మిగులు బడ్జెట్ ఉండడం, ఇక్కడి కొన్ని పథకాలను ప్రధాని కూడా మెచ్చుకోవడం ఆ రాష్ట్రానికి కలిసి వచ్చే అంశం. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సాధించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ) నిర్వహించే సర్వేలో తెలంగాణ టాప్ లో నిలవగా… ఏపీ సెకండ్ ప్లేస్ లో ఉంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖకు చెందిన వాణిజ్య విధాన విభాగం ప్రకటించిన ఈ ర్యాకుంల్లో 60.24 శాతం స్కోరుతో తెలంగాణ మొదటి స్థానంలో నిలవగా – 55.75 శాతం స్కోరుతో ఏపీ రెండో స్థానానికి పరిమితమైంది. గత సంవత్సరం సెప్టెంబర్ లో ఏపీ రెండోస్థానంలో ఉండగా తెలంగాణకు 13వ స్థానంలో ఉండేది. కానీ… ఈ ఏడాది జూన్ లో ర్యాంకులు తారుమారయ్యాయి. తెలంగాణ రెండో స్థానంలో ఉండగా ఏపీ 19వ స్థానానికి పడిపోయింది. దాంతో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది.
ఆ సమయంలో తమ వివరాలు కాపీ చేశారంటూ రెండు రాష్ట్రాలూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అంతర్జాతీయ పెట్టుబడులు – వ్యాపార అనుకూల వాతావరణం కోసం అమలు చేస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకుని ప్రపంచ బ్యాంక్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ – సులభ వాణిజ్యం)’ ర్యాంకులను ప్రకటిస్తోంది. ఈ ర్యాంకుల్లో ముందు నిలిచేందుకు రెండు రాష్ట్రాలూ పోటీ పడుతున్నాయి. శాఖలవారీగా రాష్ట్రాలు సమర్పించే సమాచారం ఆధారంగా ‘స్కోరు’ను ఇస్తూ తాత్కాలిక పద్ధతిన ర్యాంకులను ప్రకటిస్తారు. జూన్ 30 వరకు రాష్ట్రాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా తాజా ర్యాంకులు ఇచ్చారు. రెండు రాష్ట్రాల మధ్య ర్యాకుంల అంతరం తక్కువగా ఉండడంతో ప్రస్తుతానికి వివాదాలు సద్దుమణుగుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.