Loading...
You are here:  Home  >  Business News  >  Current Article

Telangana Govt is working hard in creating New Districts

By   /  August 20, 2016  /  Comments Off on Telangana Govt is working hard in creating New Districts

    Print       Email

Telanganaజిల్లాల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌పై నేడు అఖిల‌ప‌క్షం భేటీ

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల‌ను పెంచాల‌ని తెలంగాణ స‌ర్కార్ చాలా గ‌ట్టిగా నిర్ణయం తీసుకున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అయితే జిల్లాల పెంపు ప్ర‌తిపాద‌న అనేది ఒక్క టీఆర్ఎస్ పార్టీనే ఎలా తీసుకుంటుంద‌ని ప‌లు పార్టీల నాయ‌కులు విమ‌ర్శించ‌డంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అఖిల‌ప‌క్ష భేటీని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ నేప‌థ్యంలోనే శ‌నివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు స‌చివాల‌యంలోని `సి`బ్లాక్‌లో మంత్రి వ‌ర్గ ఉప సంఘం స‌భ్యులు ఆయా పార్టీల ప్ర‌తినిధుల‌తో భేటీ కానున్నారు. కాగా జిల్లాల పెంపుకు సంబంధించిన ముసాయిదాను తెలంగాణ స‌ర్కార్‌ అన్ని పార్టీలకూ సీల్డ్ క‌వ‌ర్లో పంపించ‌డం విశేషం. ఇంకో ముఖ్య‌విష‌యం ఏంటంటే మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఉప ముఖ్యమంత్రులు క డియం శ్రీహరి, మహమూద్‌ అలీ, మంత్రులు ఈటల రాజేందర్‌, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావులకు కూడా సీల్డ్‌ కవర్లోనే వివరాలు అందించడం గమనార్హం.

ప్రభుత్వం ఇచ్చిన ఆహ్వానం మేరకు టీఆర్‌ఎస్ నుంచి రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, టీడీపీ నుంచి ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీజేపీ నుంచి రామచంద్రరావు, మల్లారెడ్డి, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి, పల్లా వెంక ట్‌రెడ్డి హాజరవుతున్నారు. ఆయా రాజకీయ పక్షాలు తమ ఎజెండాల తో ఈ భేటీకి హాజరయ్యేందుకు సిద్ధమయ్యాయి. కాగా అఖిలపక్ష భేటీకి ఆహ్వానం అందకపోవడంతో నిరసన తెలిపేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ సిద్ధ‌మైంది. అంతేకాదు ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద నిర‌స‌న తెల‌ప‌నుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →