Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Telangana is attracting everyone, KCR’s inspirational speech.

By   /  August 16, 2016  /  Comments Off on Telangana is attracting everyone, KCR’s inspirational speech.

    Print       Email

తెలంగాణ దేశాన్ని ఆక‌ర్షిస్తోంది

2014-12-10_192127_KCR_HYd

InCorpTaxAct
Suvidha

 

కొత్త‌గా ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రం  రెండేళ్ల‌లోనే అభివృద్ధిలో దూసుకుపోతోంద‌ని, దేశాన్ని ఆక‌ర్షిస్తోంద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు అన్నారు. సంక్షేమంలో మ‌నం సాధించిన ఫ‌లితాలు దేశం దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయ‌న్నారు. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా కేసీఆర్ గోల్కొండ కోట‌పై త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ ఇదే గోల్కొండ కోట నుంచి మొదటిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసిన నాడు ఈ రాష్ట్రం రెండున్నర నెలల పసిబిడ్డ అని,  ఒక్కొక్కటిగా బాలారిష్టాలను దాటుకుంటూ స్థిరమైన పాలన అందిస్తూ రెండేళ్ల తక్కువ సమయంలోనే  అభివృద్ధిలో ముందుకెళ్తున్నామ‌న్నారు.  నీటి పారుదల, విద్యుత్ రంగాల్లో మహార్రాష్ట, కర్ణాటక,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో సయోధ్యను సాధించుకోగలిగామ‌న్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఒప్పందం కుదిరింద‌ని, మరో నాలుగు నెలల్లో రాష్ట్రా నికి విద్యుత్ అందుతుందని చెప్పేందుకు సంతోషిస్తున్నామ‌న్నారు. గోదావరి ప్రాజెక్టుల నిర్మాణం గత ప్రభుత్వాల విధానం వల్ల వివా దాల్లో చిక్కుకొని ముందుకు సాగ‌లేద‌ని, మహార్రాష్టతో వివాదాలు పరిష్కరించుకునే విషయంలో గత పాలకులు సరైన విధానాన్ని అవలంభించకపోగా, మరింత జఠిలం చేశార‌న్నారు.  ఈ పరిస్థితిని అధిగమించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మహార్రాష్టతో జరిపిన చర్చలు ఫలించాయ‌ని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఈ నెల 23న ముంబయిలో చారిత్రక ఒప్పందం జ‌రిగింద‌న్నారు. మరో వైపు కర్ణాటక ప్రభుత్వంతో కూడా స్నేహ సంబంధాలు బ‌ల‌ప‌డ్డాయి. దీని వల్ల మహబూబ్‌నగర్‌కు నీరందించే ఆర్డీఎస్ పనులు వేగవంతం అయ్యాయ‌న్నారు.

పోయిన ఎండకాలంలో తాగునీటి కోసం పాలమూరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభు త్వం కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి గతంలో ఎన్నడూ లేని విధంగా జూరాలకు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయించుకోగలిగామ‌న్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో మన రాష్ట్రం సమాఖ్య స్ఫూర్తిని గౌర‌విస్తోంద‌న్నారు. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ గజ్వేల్ వేదికగా ఇంటింటికీ నల్లా నీరు అందించే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించార‌ని గుర్తుచేశారు. సాగు, తాగునీటి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను, నిబద్ధతను మోడీ ప్ర‌శంసించార‌న్నారు.  జాతీయ రహదారుల విషయంలో మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయామ‌న్నారు. ఈ విషయంలో కూడా కేంద్రం సానుకూలంగా స్పందించింద‌ని, రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో 2,592 కిలోమీటర్ల జాతీయ రహదారి మాత్రమే ఉండేద‌ని, ఈ రెండేళ్లలో కొత్తగా 1951 కిలోమీటర్ల జాతీయ రహదా రిని మంజూరు చేయించుకోగలిగామ‌న్నారు. దీంతో తెలంగాణలో జాతీయ రహదా రుల పొడవు మొత్తం 4,590 కిలోమీటర్లకు చేరింది.

రాష్ట్రంలో పేద ప్రజల సంక్షే మం కోసం ప్రభుత్వం రూ. 30 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తూ 35 పథకాలను అమలు చేస్తున్న విషయం మీకందరికి తెలుసని, సంక్షేమ రంగంలో తెలంగాణ దేశంలో నంబర్‌వన్‌గా నిలిచిందని సంతోషకరంగా తెలియజేస్తున్నామ‌న్నారు.  ఎస్సీ, ఎస్టీల కోసం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మీ పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచే బీసీ, ఈబీసీలకు వర్తింపజేస్తున్న‌ట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం ఈ విద్యా సంవత్సరం నుంచే 250 గురుకుల విద్యాలయాలను కొత్తగా మంజూరు చేశాం. ఇప్పటికే 230 గురుకులాలు ప్రారంభమై విద్యా బోధన జరుగుతోంద‌న్నారు.  మరో 20 గురుకులాలు వారం రోజుల్లో ప్రారంభమవుతాయ‌న్నారు.  బీసీ విద్యార్థుల కోసం కూడా త్వరలోనే 50 రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేస్తామ‌న్నారు.  తెలంగాణ రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అందించాలనే బృహత్ సంకల్పానికి బలహీనవర్గాల గురుకులాలతో బీజం పడినందుకు సంతోషిస్తున్నామ‌న్నారు.

ఇప్పటికే 40 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నామ‌ని,  కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులకు కూడా సన్నబియ్యంతో భోజనం పెడుతామ‌ని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ఎస్టీలు, మైనార్టీలు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పొందలేదు. ఎస్టీలు, మైనార్టీల స్థితిగతులు అధ్యయనం చేయడానికి నియమించిన చెల్లప్ప, సుధీర్ కమిషన్లు ఇటీవలే నివేదికలు అందించాయ‌ని త్వరలోనే ఎస్టీలు, మైనార్టీల జనాభా దామాషాను అనుసరించి రిజర్వేషన్లు కల్పిస్తామని, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు పెంచుతామ‌న్నారు.  పేద బ్రహ్మణుల కోసం బడ్జెట్‌లో రూ. 100 కోట్లు కేటాయించడం జరిగింద‌న్నారు.  వారి అభివృద్ధి కోసం తగిన పథకాలు త్వరలోనే రూపొందించబడుతాయ‌ని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా హుస్సేన్‌సాగర్ తీరంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకోబోతున్నామ‌న్నారు.

రాష్ట్రంలోని ప్రస్తుత జిల్లాలను పునర్‌వ్యవస్థీకరించే ప్రక్రియ ప్రారంభ‌మైంద‌న్నారు.  తెలంగాణ ప్రజలకు ప్రీతిపాత్రమైన దసరా పండుగ కానుకగా ఆరోజు నుంచే కొత్త జిల్లాలు పని చేయడం ప్రారంభిస్తాయని సంతోషంగా ప్రకటిస్తున్నాన‌న్నారు. తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతోంద‌న్నారు. మన రాష్ట్రానికి నీటి కేటాయింపుల‌కు అనుగుణంగా కాళేశ్వరం, పాలమూరు, శ్రీసీతారామ ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించడానికి ప్రభుత్వం పూనుకున్న‌ట్లు చెప్పారు. గతం నుంచే నిర్మాణంలో ఉండి నత్తనడకన నడుస్తున్న ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం పరుగులు పెట్టించిందని, పాలమూరు జిల్లాలోని బీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయ‌న్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి ఈ నాలుగు ప్రాజెక్టులు నూటికి నూరు శాతంపూర్తవుతాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టుల ద్వారా ఈ ఖరీఫ్‌కు 50 వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. వచ్చే ఏడాది నాటికి ఆదిలాబాద్ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులన్నీ పూర్తి అయి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తోంద‌న్నారు. రూ. 200 కోట్లు ఖర్చు పెట్టి ఎస్సారెస్పీ కాలువలను బాగు చేయించాం. మిషన్‌కాకతీయ ద్వారా రాష్ట్రంలోని 46 వేల చెరువులనుపునరుద్ధరించాలని లక్ష్యం పెట్టుకున్నామ‌ని,  ఇప్పటి వరకు 20 వేల చెరువులను పునరుద్ధరించిన‌ట్లు చెప్పారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →