అంబురం అంటిన కేటీఆర్ పుట్టిన రోజు సంబురం
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పుట్టిన రోజును నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎంత ఘనంగా అంటే ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలో కూడా ఆ విధంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించ ఉండరంటే అతిశయోక్తి. రాజధాని నగరమైన హైదరాబాద్‌లో కేటీఆర్ చేసిన అభివృద్ధిని కీర్తిస్తూ మూడు విమానాల ద్వారా కరపత్రాలను ఆకాశం నుంచి నగరం అంతా చల్లారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ జన్మ దిన వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించడంతో పాటు కాబోయే సీఎం కేటీఆర్ అంటూ బ్యానర్లు కూడా కట్టారు.
కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి…
ఐటీ శాఖ మంత్రిగా ఇవాళ కేటీఆర్ కీర్తి కేవలం తెలంగాణకు పరిమితం కాలేదు. ఇటీవల ఆపిల్ హైదరాబాద్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవంలో కంపెనీ సీఈవో టిం కుక్ సమక్షంలో మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగం వీడియో దేశవ్యాప్తంగానే కాదు, పలు ప్రపంచదేశాల్లో కూడా సంచలనం సృష్టించింది. బుల్లి దేశం శ్రీలంక మొదలుకొని జనాభాలో అతి పెద్ద దేశం చైనావరకూ అనేక దేశాల పౌరులు ఈ వీడియోను వాట్సాప్‌లో వీక్షించారు. ఈ యువమంత్రి భారతదేశానికే ఒక ఆశాకిరణమని వివిధ వేదికల మీద పొగడ్తల జల్లు కురిపించారు. అనేక రాష్ర్టాల నెటిజెన్లు ఆ ప్రసంగానికి జేజేలు పలికారు. ఇంకొందరు నెటిజెన్లయితే కొంతకాలం పాటు కేటీఆర్‌ను మా రాష్ర్టానికి అరువిస్తారా! అని చమత్కరించారు కూడా. అయితే కేటీఆర్ ఒక లక్ష్యం నిర్దేశించుకున్నాక అది సాధించడానికి ఆయన ఎలా కష్టపడతారో చెప్పడానికి ఆపిల్ సంస్థ హైదరాబాద్‌కు రావడమే ఒక ఉదాహరణ.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.