Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Telangana media

By   /  July 31, 2016  /  No Comments

    Print       Email

13882278_1937108043182652_8320041323298956692_n

తెలంగాణా మీడియా అనాధగా ఎందుకయింది?

InCorpTaxAct
Suvidha

అనాధలా మారిన  తెలంగాణ మీడియా

 
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత మీడియా రంగం అనాధలా మిగిలిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రివర్గ సమావేశాలు జరిగాక తీసు కున్న నిర్ణయాలు ప్రధాన మైనవయితే స్వయంగా ముఖ్యమంత్రి, సాధా రణమైతే సమాచార శాఖ మంత్రి మీడియాకు వెల్లడించడం అనవాయితీగా వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మంత్రివర్గంలో అసలు సమాచారశాఖకు ప్రత్యేకంగా మంత్రిని నియమించకపోగా కనీసం మరో కీలకమైన మంత్రికి బాధ్యతల్ని కూడా అప్ప గించలేదు.

 

సమాచార •శాఖకు ప్రత్యేకంగా కమీ షనర్‌ కూడా నియమించ బడలేదు. ఇటీవలి వరకు ప్రణాళిక విభాగం ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్న బి.పి.ఆచార్యకు, ప్రస్తుతం ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌కు అదనంగా సమాచారశాఖ బాధ్యతలను అప్పగించారు. ఇక సమాచార శాఖలో డైరెక్టర్లుగా ఉన్న ఎ.సుభాష్‌గౌడ్‌, వి.సుభాష్‌లు పదవీ విరమణ పొందిన తర్వాత డెరెక్టర్‌గా అదనపు బాధ్యతలను కూడా మరో అధికారికి ఇవ్వలేదు. పత్రికలకు, టీవీలకు జారీచేసే ప్రభుత్వ ప్రకటనలను అడిషనల్‌ డైరెక్టర్‌ స్థాయిలో ఉన్న నాగయ్యకు పూర్తిస్థాయి అధికారం లేనందువల్ల కమీషనర్‌ నవీన్‌మిట్టలే స్వయంగా చూస్తున్నారు. ఆర్థిక శాఖలో అనునిత్యం బిజీగా ఉండే ఆయన పూర్తి సమయాన్ని సమాచారశాఖకు కేటాయించలేకపోతున్నారు. జర్నలిస్టులకు శిక్షణాతరగతులు నిర్వహించడం, వార్తా రచనలలో మెలుకువలను విడమర్చి చెప్పే పుస్తకాలను ప్రచురించడం, జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించాల్సిన ప్రెస్‌ అకాడమీ నిర్వీర్యమైంది. దీంతో ప్రతి ఫైల్‌ సీఎం దృష్టికి వెళ్తే తప్ప పరిష్కారానికి నోచుకోని పరిస్థితులు నెలకొన్నాయి. బాధ్యులైన మంత్రి, అధికారులు లేని కారణంగా స్వరాష్ట్రం వచ్చాక కూడా తెలంగాణలోని జిల్లాలు, మండ కేంద్రాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ఇంకా ఆంధప్రదేశ్‌ పేరున్న అక్రెడిటేషన్లు, బస్సుపాసులనే గతిలేక వినియోగించుకుంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →