Loading...
You are here:  Home  >  Business News  >  Current Article

Telangana New District formation will be after Dasara

By   /  August 23, 2016  /  Comments Off on Telangana New District formation will be after Dasara

    Print       Email

Telanganaద‌స‌రా నుంచి తెలంగాణలో కొత్త జిల్లాలు

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలచుకున్న కొత్త జిల్లాల అంశం కొలిక్కి వచ్చింది. ఈమేరకు సోమ‌వారం జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లుగా విభజన చేయనున్నట్టు ముసాయిదాలో పేర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలను WWW.NEWDISTRICTSFORMATION.TELANGANA.GOV.IN లో పొందుపరిచింది. దీనిపై ఏవైనా సూచనలు, అభ్యంతరాలుంటే నెల రోజుల లోపు తెలిపేందుకు అవకాశం ఇచ్చింది. కొత్తగా 17 జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. 9 జిల్లాలకు విడివిడిగా నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్గదర్శకాల కోసం జీవో నెంబరు 194 విడుదల చేశారు. జిల్లా స్థాయిలో మంగళవారంనుంచి కలెక్టర్ – జెడ్పీ – సబ్ కలెక్టర్ – ఆర్డీవో – ఎమ్మార్వో – ఎండీవో – గ్రామపంచాయతీ కార్యాలయాల్లో నోటిఫికేషన్ ప్రదర్శిస్తారు.  రాష్ర్ట విభజన తరువాత ఏపీ – తెలంగాణల్లో కొత్త జిల్లాలు ఏర్పడనుండడం ఇదే ప్రథమం.

కొత్తగా 17 జిల్లాలు ఏర్పటవుతున్నాయి. దీంతో మొత్తం జిల్లాలు 27 కానున్నాయి. 31 మండలాలు – 14  రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పటవుతున్నాయి. దీంతో 58 రెవెన్యూ డివిజన్లవుతాయి. 9 జిల్లాలకు విడివిడిగా నోటిఫికేషన్లు ఇచ్చారు. అన్నీ పూర్తయ్యాక దసరా నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి వస్తాయని రాష్ట్ర పెద్ద‌లు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో పది జిల్లాలు – 44 రెవెన్యూ డివిజన్లు – 459 మండలాలున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన పునర్విభజన ముసాయిదా ప్రకారం మొత్తం 27 జిల్లాలు – 58 రెవెన్యూ డివిజన్లు – 490 మండలాలుగా రాష్ట్ర పరిపాలనా ఊపందుకోనుంది. అయితే ముసాయిదా నోటిఫికేషన్ విడుదల కాగానే కొత్త జిల్లాల్లో పెద్దఎత్తున సంబరాలు మొదలయ్యాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →