బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్ధిక మంత్రి ఈటెల..
ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ అసెంబ్లీలో 2016 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మూడో సారి ఈటెల వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వాస్తవాల ఆధారంగా బడ్జెట్ ను రూపొందించామని ఆయన తెలిపారు. సాగునీరు, విద్యుత్, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కేంద్రం రూ.450 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్ర బకాయిలను ప్రస్తుతం చెల్లించాల్సి వస్తుందన్నారు. రాష్ట్ర స్థూల ఆదాయం గణనీయంగా పెరిగిందని.. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 11.67 శాతం మెరుగుపడిందన్నారు. నిశిత సమీక్షల అనంతరం 2015-16 బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. రెండేళ్లలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉందని తెలిపారు. 2015-16 లో రాష్ట్ర తలసరి ఆదాయం 10.7 శాతం పెరిగిందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వృద్ధి తగ్గిందన్నారు. బలహీన వర్గాల కోసం పించన్లు పెంచామని చెప్పారు.
బడ్జెట్ ముఖ్యాంశాలు ఇవే..
2016-17 బడ్జెట్ అంచనా రూ.1,30,415.87 కోట్లు..
ప్రణాళిక వ్యయం రూ.67,630 కోట్లు..
ప్రణాళికేతర వ్యయం రూ.62.785 కోట్లు
రెవెన్యూ మిగులు రూ.3318 కోట్లు
ద్రవ్యలోటు రూ.23,4672 కోట్లు…
నీటిపారుదల రంగానికి రూ.25 వేల కోట్లు.
పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూ.7861 కోట్లు..
కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.6286 కోట్లు..
సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.1152 కోట్లు
రూణమాఫీకి కేటాయింపులు రూ.3718 కోట్లు
ఎస్సీ సంక్షేమానికి రూ.7122 కోట్లు..
ఎస్టీ సంక్షేమానికి రూ.3752 కోట్లు.
బీసీ సంక్షేమానికి రూ.2538 కోట్లు
మైనారిటి సంక్షేమానికి రూ.1204 కోట్లు
మిషన్ కాకతీయకు రూ.25 వేల కోట్లు..
భగీరథకు 42.27 టీఎంసీల నీటి సరఫరా
రాబోయే మూడేళ్లలో 23, 912 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
కరెంటు కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.
సౌర విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పే వారికి సత్వర అనుమతులు
2016-17 నాటికి మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం..
వచ్చే ఖరీఫ్ నుంచి రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరా
వ్యవసాయం అనుబంధ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత..జ
రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా అభివృద్ధి చేస్తున్నాం..
రైతుల ఉత్పత్తులకు మార్కెంటింగ్ సదుపాయం పెంపు
రెండేళ్లలో వంద శాతం రుణమాఫీ అమలు
సూక్ష్మ సేద్యం సబ్బిడీ పరిమితి సడలింపు
ప్రధాని ఫసల్ బీమా యోజన రాష్ట్ర రైతులు ఎంతో తోడ్పాటునిస్తుంది…
మార్కెటింగ్ శాఖ ద్వారా 300 చోట్ల గిడ్డంగులు నిర్మిస్తున్నాం..
చెరువుల పునరుద్ధరణ వల్ల మత్స్య పరిశ్రమ వృద్ధి చెబుతుంది..
సంచార పశువైద్య శాలలను పటిష్ట పరుస్తున్నాం..
ప్రజా వైద్యంలో సంస్కరణల అవసరం ఉంది..
ప్రభుత్వ ఆస్పత్రుల మెరుగుదలకు చర్యలు
2016-17 రాష్ట్ర ఆదాయపు అంచనా రూ.72.412 కోట్లు
కేంద్రం ద్వారా అందే నిధుల అంచనా రూ.28,512,52 కోట్లు,
ఆసరా పించన్ల కోసం రూ.4693 కోట్లు.
కళ్యాణలక్ష్మీ పథకానికి రూ.738 కోట్లు…
మహిళ శిశు సంక్షేమానికి రూ.1553 కోట్లు..
బ్రాహ్మణ సంక్షేమానికి రూ.100 కోట్లు..
రహదారులు-భవనాలకు రూ.3333 కోట్లు.
చారిత్రక ఆలయాల పునరుద్ధరణకు వన్ టైం గ్రాంట్ రూ.50 కోట్లు…
యువజన వ్యవహారాలు, పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ.232 కోట్లు..
కొత్త ఆశ్రమ పాఠశాలలకు రూ.350 కోట్లు…
నగరంలో సీసీ టీవీలకు రూ.225 కోట్లు..
పోలీసు స్టేషన్ లలో రిసెప్షన్ సెంటర్ల ఆధునీకరణ
సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ.140 కోట్లు…
పోలీస్ సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణానికి రూ.72 కోట్లు…
ఎస్పీ, నగర కమిషనర్లకు రూ.కోటి చొప్పున ఆకస్మిక నిధి
డీజీపీకి రూ.10 కోట్ల చొప్పున ఆకస్మిక నిధి
రూ.64 కోట్లతో కొత్తగా 63ఫైర్ స్టేషన్లు..
వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖలకు రూ.6,759 కోట్లు
ప్రజారోగ్య రంగానికి సరిపడా నిధులు కేటాయిస్తాం…
పంచాయతీ, గ్రామీణాభివృద్ధికి రూ.10,731 కోట్లు..
వైద్య పరికరాల కొనుగోలుకు రూ.600 కోట్లు
వ్యాధి నిర్ధారణ పరికరాల కొనగోలుకు రూ.316 కోట్లు.
మందులు, చికిత్స పరికరాల కోసం రూ.225 కోట్లు
2016-17 లో ఆరోగ్య రంగానికి రూ.5,967కోట్లు
పట్టణాభివృద్ధికి రూ.4815 కోట్లు…
విద్యాశాఖకు ప్రణాళిక వ్యయం కింద రూ.1694 కోట్లు
విద్యాశాఖకు ప్రణాళికేతర వ్యయం కింద రూ.9,044 కోట్లు
ప్రత్యేక అభివృద్ధి కోసం రూ.4,675 కోట్లు…
హైదరాబాద్ మంచినీటి సరఫరా బోర్డుకు రూ.వెయ్యి కోట్లు…
మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అధారిటీకి రూ.650 కోట్లు..
ఖమ్మం జిల్లాలో మెగాఫుడ్ పార్కుకు కేంద్రం అనుమతి
మెదక్ లో నిమ్జ్ ప్రారంభిస్తున్నాం…
మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాలకు ప్రణాళిక వ్యయం కింద కేటాయింపులు
వరంగల్ లో టెక్స్ టైల్ హబ్ ఏర్పాటు చేస్తాం..
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.