Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Telangana Rashtra Samithi wins in Achampet, Warangal, Khammam civic polls..

By   /  March 9, 2016  /  Comments Off on Telangana Rashtra Samithi wins in Achampet, Warangal, Khammam civic polls..

    Print       Email

trs car new

‘పుర’ ఎన్నికల్లో టీఆర్ఎస్ అపూర్వ విజయం..

InCorpTaxAct
Suvidha

 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అపూర్వ విజయం సొంతం చేసుకున్న టీఆర్ఎస్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా విజయకేతనం ఎగురవేసింది. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ కి తిరుగేలేదని ప్రూవ్ చేసింది. అంతలా ఆ పార్టీకి ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. ఇక టీఆర్ఎస్ ధాటికి ప్రత్యర్ధి పార్టీలు విలవిలలాడాయి. వరంగల్, ఖమ్మంలో టీడీపీ ఖాతా తెరవలేకపోయింది. టీఆర్ఎస్ కు అద్వితీయ విజయం దక్కడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది.

సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన దగ్గర నుంచి జరిగిన ప్రతి ఎన్నికలోనూ కారు జోరు చూపించింది. వరంగల్‌ లోక్‌సభ, నారాయణఖేడ్‌ ఉప ఎన్నిక, గ్రేటర్‌ హైదరాబాద్‌… ఇలా ఎక్కడ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ విజేత నిలిచింది. వీటికి కొనసాగింపుగా బుధవారం వెలువడిన గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, అచ్చంపేట నగర పంచాయితీ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. అభివృద్ధి, సంక్షేమమే నినాదంగా ఎన్నికల బరిలోకి దిగిన టీఆర్ఎస్ ను జనం అందలం ఎక్కించారు.

గ్రేటర్‌ వరంగల్‌లో…

గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు చూపించింది. మొత్తం 58 డివిజన్లలో టీఆర్ఎస్ 44 డివిజన్లలో విజయం సాధించింది. కారు జోరుకు సైకిల్ కు పంక్చర్ అయింది. మరికొన్ని పార్టీలు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి.

వరంగల్ లో మొత్తం డివిజన్లు 58.. టీఆర్ఎస్ 44.. కాంగ్రెస్‌ 4.. టీడీపీ 00.. బీజేపీ 1.. ఇతరులు 9

ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండా రెపరెపలు..

ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండా రెప రెపలాడింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచీ దూకుడు టీఆర్ఎస్ జోరు ప్రదర్శించింది. మొత్తం 50 డివిజన్లలో 34 కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ 10..వైసీపీ 2.. సీపీఐ 2.. సీపీఎం-2 సాధించాయి. ఇక్కడ కూడా టీడీపీ ఖాతా తెరవలేదు..

అచ్చంపేట…

మొత్తం డివిజన్లు 20.. టీఆర్ఎస్ 20.. మహాకూటమి ‌0

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని జనం ఆదరించారు: సీఎం కేసీఆర్kcr at narayan khed by poll - public meeting

గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌, అచ్చంపేట నగర పంచాయతీలో గెలుపు అందించిన ప్రజలకు సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ఓటర్లు అర్ధం చేసుకున్నారని అన్నారు. పార్టీ విజయం కోసం శ్రమించిన పలువురికి ఆయన అభినందనలు తెలిపారు. వరంగల్‌, ఖమ్మం, అచ్చంపేట ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు. విజయం సాధించిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →