అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి ఈటెల రాజేందర్..
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ.1,49,446 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. తనకు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం రావడం ఎంతో అదృష్టమని అన్నారు. తాము ప్రవేశపెట్టినది పేదల బడ్జెట్ అని తెలిపారు. తమ సర్కారుపై ప్రజలు ఆశలు నిలబేట్టలా బడ్జెట్ రూపకల్పన చేశామన్నారు. అన్ని వర్గాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో బడ్జెట్ ను రూపొందించామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్రాదాయంలో 19.61 శాతం వృద్ధి రేటు సాధించామని అన్నారు.
బడ్జెట్ ముఖ్యాంశాలు ఇవే…
రూ.1,49,446 కోట్లతో రాష్ట్ర బడ్జెట్
నిర్వహణ వ్యయం రూ.61,607 కోట్లు
రెవెన్యూ మిగులు అంచనా రూ.4,571 కోట్లు
ఎస్సీల అభివృద్ధి కోసం రూ.14, 375 కోట్లు
ఎస్టీల అభివృద్ధి కోసం రూ.8,165 కోట్లు
పారిశ్రామిక రంగానికి రూ.985 కోట్లు
పర్యాటక, సాంస్కతిక రంగాలకు 198 కోట్లు
హరితహారానికి రూ.50 కోట్లు
పారిశ్రామిక రంగానికి రూ.985 కోట్లు
ద్రవ్యలోటు రూ.26,096 కోట్లు
జీహెచ్ ఎంసీకి రూ.1000 కోట్లు
శాంతిభద్రతల కోసం రూ.4828 కోట్లు
మిషన్ భగీరథకు రూ.3000 కోట్లు
వైద్య ఆరోగ్య రంగానికి రూ.5976 కోట్లు
జర్నలిస్టుల సంక్షేమానికి రూ.30 కోట్లు
రహదారుల అభివృద్ధికి రూ.5,033 కోట్లు,
మైనార్టీ సంక్షేమానికి రూ.1249 కోట్లు
గ్రేటర్ వరంగల్ కు రూ.300 కోట్లు
పట్టాణాభివృద్ధికి రూ.594 కోట్లు
ప్రగతి పద్దు రూ.88,038 కోట్లు
నిర్వహణ వ్యయం రూ.61,607 కోట్లు
ఐటీ రంగానికి రూ.252 కోట్లు
రుణమాఫీకి 4 వేల కోట్లు
సాగునీటి ప్రాజెక్టులకు 25 వేల కోట్లు
విద్యుత్ రంగానికి రూ.4300 కోట్లు
మైనార్టీలకు 201 గురుకులాలు
సమాచార ప్రసారశాఖకు రూ.252 కోట్లు
సైనిక సంక్షేమానికి ప్రత్యేక నిధి
ఆసుపత్రుల్లో మందుల కొనుగోళ్లకు నిధుల పెంపు
హైదరాబాద్ లో మరో 3 మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్
కరీంనగర్ లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
నేత కార్మికులకు సంక్షేమానికి రూ.1200 కోట్లు
రహదారులకు రూ.5033 కోట్లు
రజక, నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.500 కోట్లు
వరంగల్ లో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు
ఆసరా ఫించన్లకు రూ.5330 కోట్లు
ఎంబీసీల సంక్షేమం కోసం రూ.1000 కోట్లు
కళ్యాణలక్ష్మీ, షాదీముబారకులకు రూ. 75,116 రూపాయలకు పెంపు
ఫీజు రీఎంబర్స్ మెంట్ కు రూ.1939 కోట్లు
మహిళా, శిశు సంక్షేమానికి రూ.1731 కోట్లు
పంచాయతీ రాజ్ శాఖకు రూ.14,723 కోట్లు
300 గోముల నిర్మాణానికి రూ.1024 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ.5,070 కోట్లు
పాఠశాల విద్యకు రూ.12705 కోట్లు
మూసీనది పరిరక్షణకు రూ.3060 కోట్లు
పట్టణాభివృద్ధికి రూ.5,599 కోట్లు
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు బడ్జెటేతర నిధులు
వచ్చే ఏడాది నుంచి 119 బీసీ గురుకుల పాఠశాలలు
బ్రాహ్ముణుల సంక్షేమానికి రూ.100 కోట్లు
ప్రభుత్వాస్పత్రులో కాన్పుకు వచ్చే గర్భిణులకు రూ.12 వేలు
ఆడ పిల్ల పుడితే అదనంగా రూ.1000
నవజాత శిశువుల పథకం కోసం రూ.600 కోట్లు
కేసీఆర్ పేరుతో పురిటిబిడ్డ సంరక్షణకు 16 వస్తువులతో కిడ్స్ కిట్
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.