Loading...
You are here:  Home  >  Business News  >  Current Article

Telangana temples, rivers are getting neglected

By   /  August 13, 2016  /  Comments Off on Telangana temples, rivers are getting neglected

    Print       Email

KCRఅప్పుడు తెలంగాణ‌ను ప‌ట్టించుకోలేదు

 

InCorpTaxAct
Suvidha

 

 

కృష్ణా పుష్క‌రాల ప్రారంభోత్స‌వంలో కుటుంబ స‌మేతంగా పుష్క‌ర స్నానం చేసిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.  గతంలో జోగుళాంబ సన్నిధినుంచి పాదయాత్రలో ఉద్యమంలో పాల్గొన్న తాను ఇదే క్షేత్రానికి పుష్కరాల ప్రారంభానికి రావటం ఎంతో ఆనందాన్నిచ్చిందని కేసీఆర్‌ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పుష్కర వేడుకల్లో కూడా తెలంగాణ విస్మరణకు గుర్తైందని సీఎం గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో ఆలయాలు, ప్రజలనే కాదు పవిత్రమైన నదులను కూడా పట్టించుకోలేదన్నారు. గోదావరి పుష్కరాలంటే రాజమండ్రి అని, కృష్ణా పుష్కరాలంటే బెజవాడ అంటూ ప్రచారం చేసి తెలంగాణను పట్టించుకోలేదన్నారు. ఇవాళ సొంత రాష్ట్రంలో అద్భుతమైన రీతిలో కృష్ణా పుష్కర వేడుకలను ప్రారంభించుకున్నామన్నారు.  పండితులు, వేదమూర్తుల సూచనల మేరకే గొందిమళ్లలో పుష్కరఘాట్ ఏర్పాటు చేయడం జరిగిందని, దీనికి జోగుళాంబ ఘాట్‌గా నామకరణం చేశామని తెలిపారు. పుష్కరాల్లో స్నానమాచరించిన తర్వాత శక్తి పీఠంలో అమ్మవారిని దర్శించుకోవటం ఎంతో శ్రేష్ఠమని అన్న సీఎం ఈ భాగ్యం అందరికీ కలుగదన్నారు.

దేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో ఐదో శక్తి పీఠమైన అలంపూర్‌ను ఉమ్మడి పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. తగిన ప్రచారం లేక పోవటంతో కనీసం ఈ ఆలయ ప్రాశస్థ్యం కూడా ప్రజలకు తెలియకుండా పోయిందన్నారు. ఆర్‌డీఎస్‌కు న్యాయం చేయాలని సమైక్యపాలనలో జోగుళాంబ సన్నిధి నుంచి పాదయాత్ర చేసిన తాను జోగుళాంబ కరుణతోనే రాష్ర్టాన్ని సాధించుకుని అమ్మదీవెన మేరకు పుష్కరాల ప్రారంభానికి మళ్లీ అలంపూర్‌కు వచ్చానన్నారు. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖసంతోషాలు కలుగాలని, సుభిక్షంగా ఉండాలని కృష్ణమ్మను కోరుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. కాగా కేసీఆర్‌  పుష్కర ప్రారంభోత్సవాల సందర్భంగా పోస్టల్ శాఖ రూపొందించిన జోగుళాంబ పోస్టల్ కవరును ఆవిష్కరించి, మైస్టాంప్ పథకాన్ని ప్రారంభించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →