Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

తెలియదు..!

By   /  July 15, 2016  /  No Comments

    Print       Email

అడుగు ముందుకేయకుండ ఆగెనెందు కో తెలియదు..!
సిగ్గుమొగ్గ లౌతుంటే విరిసెనెందుకో తెలియదు..!

చెప్పలేని మోహాలకు తెర తియ్యగ వెనుకాడును..!
ముగ్ధత్వపు చిరునామా చూపెనెందుకో తెలియదు..!

InCorpTaxAct
Suvidha

సంప్రదాయ వాకిటతా రంగవల్లి వలె నున్నదె..!
చిరు ఆశల ఊయలనే నిలిపెనెందుకో తెలియదు..!

పరిహాసములాడలేని పాలగ్లాసు మనసన్నది..!
చిరునవ్వుల వెన్నెలనే కురిసెనెందుకో తెలియదు..!

సరసవీణ రాగాలను పల్లవింప జేయునేమొ..!
మౌనకల్ప తరువు లాగ వేచెనెందుకో తెలియదు..!

ఈ మాధవ పదపదమున పరిమళించు హంస సాక్షి..!
అమృతభావ సంపదయై అందెనెందుకో తెలియదు..!

Author:

Madhav Rao Koruprolu

13254167_896390973822258_3568960880258876080_n

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →