Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Telugu Association Of Greater Chicago (TAGC) “Bowling Event” – 2017

By   /  February 28, 2017  /  No Comments

    Print       Email

Bowling3చికాగో- ఆదివారం ఫిబ్రవరి 26 , 2017 :  

చికాగో మహా నగర తెలుగు సంస్థ (TAGC)  ఆద్వర్యములొ ప్రతి ఏటా నిర్వహించే ఆటవిడుపు కార్యక్రమాలలో భాగముగా కుటుంభ సమేతముగా నిర్వహించే బౌలింగ్ (Bowling)  టోర్నమెంట్ ఇక్కడి స్థానిక ROSELLEలోని  STRIKE TEN BOWLING LOUNGEలో  నిర్వహించబడింది. ఈ  సంవత్సరం నిర్వహించిన బౌలింగ్  టోర్నమెంట్లో రికార్డు స్థాయిలో  మొత్తం  173 క్రీడాకారులు పాల్గొన్నారు.  టోర్నమెంట్ సందర్బంగా బౌలింగ్  ప్రాంగణం  పాల్గొనడానికి వచ్చిన  వారితో  కిక్కిరిసి  పోయింది. వచ్చిన క్రీడాకారులు ఎంతో  ఉత్సాహంతో  పోటీలో  పాల్గొన్నారు.ఈ పోటీలలో  5 ఏళ్ళ  చిన్నారుల  నుండి  మొదలుకొని  అన్ని  వయసుల  వారు  పాల్గొని ఘన విజయము చేసారు.

InCorpTaxAct
Suvidha

అమెరికాలో  నివసిస్తున్న  ప్రజలు  తమ  యాంత్రిక  జీవనం  నుండి  బయట  పడేందుకు  ఈ  పోటీలు  ఎంతో  ఉపయోగ  పడతాయి. కుటుంబ  సభ్యులతో, స్నేహితులతో  కలిసి  కొద్దీ  సేపు  సేద  తీరడం  కొరకు  ఈ  పోటీలను  TAGC సంస్థ వారు గత 40 సంవత్సరములుగా నిర్వహిస్తున్నారు . జీవితంలో  క్రీడల ఆవశ్యకతను  తెలియజేయడమే  ధ్యేయంగా  ట్ఏజిసి వివిధ  క్రీడా  పోటీలు  నిర్వహిస్తుంది. క్రీడల్లో  పాల్గొనడం  వాళ్ళ  ఆరోగ్యంతో పాటు   ఆత్మ  స్థైర్యం, క్రీడాస్ఫూర్తి  లాంటి  మంచి  లక్షణాలు  అలవాడుతాయి. TAGC సభ్యులు ఇచ్చే  స్ఫూర్తితో  ట్ఏజిసి  పలు పోటీలను  తమ సభ్యులకు అందుబాటులోకి  తేవడానికి ప్రయత్నిస్తుంది .

పోటీలో పురుషులు, మహిళలు, బాలలు మరియు బాలికల విభాగాలలో మొదటి ముగ్గురిని విజేతలుగా ప్రకటించారు. గెలుపొందిన వారి వివరాలు:

Special Consolation prize winner for wife and husband:
శ్రీమతి & శ్రీ లావన్య సంతోష్

Men Category :
సాయిరవి  సూరిభోట్ల  – Winner
వేణుగోపాల్   ఎలిశెట్టి  – Runner
సతీష్  నిడదవోలు  – 3rd Prize

Bowling_Group_PhotoWomen Category :
మానస  లట్టుపల్లి – Winner
శిరీష  ఏడే  – Runner
లక్ష్మి  కోరిపల్లి  – 3rd Prize

Boys Category :
మోనిష్  మెతుకుమల్లి  – Winner
అన్జాన్   ఆనందుల  – Runner
అభయ్  గూడూరు  – 3rd Prize

Girls Category :
ఆశిక కోరిపల్లి – Winner
రివ  లక్కడీ – Runner
అన్షు గొంది – 3rd Prize

Bowling1పోటీల అనంతరం యువత అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్న యూత్ కమిటీ ప్రత్యేక నెట్వర్కింగ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో యువత ఎంతో ఉత్సాహంతో పాలుపంచుకుంది. ఈ సందర్బంగా ఐటీ రంగ నిపుణులు మిస్టర్ ఇవాన్ స్క్రోన్స్ (MR Evan Scronce) అతిధిగా విచ్చేసి యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత  కాలములో  డిజిటల్ రంగం లో ఉద్యోగ అవకాశాలపై  సమాచారాన్ని అందించారు. తదనంతరం అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే మరియు యూత్ కమిటీ చైర్ సాయి గొంగాటి ఇవాన్ స్క్రోన్స్ గారిని సత్కరించి కృతజ్ఞతలు తెలియజేసారు.

 ఈ పోటీలలో  పాల్గొని  విజయవంతం  చేసిన  క్రీడాకారులకు  మరియు  నిర్వహించడంలో  తోడ్పడిన  వాలంటీర్స్ కు  , ఈ పోటీని ఇంత ఘనముగా నిర్వహించడానికి Sponsor చేసిన PEGASUS KNOWLEDGE SOLUTIONS యజమాని   శ్రీని ఓరుగంటి గారికి మరియు STRIKE 10 యజమాని దితు భగవాన్కర్ గార్లకు ట్ఏజిసి అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే కృతజ్ఞతలు తెలియజేసారు. స్పోర్ట్స్ కమిటీ చైర్ సప్తగిరి సంగేమ్ ను మరియు  కమిటీ సభ్యులను అభినందించారు.  ఇదే సందర్బంగా సభ్యత్వ కమిటీ చైర్ మమతా లంకల, కోశాధికారి  వెంకట్ గునుగంటి మరియు కార్యవర్గ సభ్యులకు  కృతజ్ఞతలు తెలియజేసారు.

Update on upcoming events:

 TAGC International Women’s day celebration on Mar 12th,2017

TAGC Ugadhi & Sree Rama Navami Event – April 22nd, 2017

 Click here for event photos

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →