Loading...
You are here:  Home  >  Community News  >  Telugu Community News  >  Current Article

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాక్రమెంటో(టీఏజీఎస్) వారి సంక్రాంతి ఉత్సవాలు

By   /  February 7, 2014  /  No Comments

    Print       Email

తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే సంక్రాంతి శోభ ఖండాంతరాలను దాటింది. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో నగరంలో 2014 సంక్రాంతి సంబరాలను తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాక్రమెంటో(టీఏజీఎస్) వారు ఘనంగా నిర్వహించారు . స్థానిక ఫాల్సోం నగరం లో హారిస్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ధియేటర్ లో పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు కుటుంబ సమేతం గా తరలి వచ్చి అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు.

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాక్రమెంటో(టీఏజీఎస్) వారి సంక్రాంతి ఉత్సవాలు (19)

InCorpTaxAct
Suvidha
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాక్రమెంటో(టీఏజీఎస్) వారి సంక్రాంతి ఉత్సవాలు (19)

 

సంక్రాంతి సంబరాలలో ప్రత్యేకంగా రూపొందించిన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు టీఏజీఎస్ 10వ వార్షికోత్సవం సందర్భం గా మరెన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్ రూపొందించడం జరిగిందని ఈ సందర్భం గా టీఏజీఎస్ అధ్యక్షురాలు స్వర్ణ కంభంపాటి తెలిపారు. తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి సంబరాలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. తెలుగింటి ఆడపడుచుల సంప్రదాయ వస్త్రధారణ, తెరపై రంగు రంగుల ముగ్గులు,  సంక్రాంతి ప్రాముఖ్యత తెలుపుతూ పెద్దలు పిల్లలు ప్రదర్శించిన ఆట పాటలతో హారిస్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ధియేటర్  లో అచ్చ తెలుగు పల్లె సంస్కృతి కొలువయింది. తెలుగు సాంప్రదాయాన్నిపాటిస్తూ అచ్చతెలుగు వంటకాలతో, తెలుగు భాషాసంస్కృతులకు సంబంధించిన కార్యక్రమాలతో ఆహ్వానితులు ఉల్లాసంగా గడిపారు.

 

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాక్రమెంటో(టీఏజీఎస్) వారి సంక్రాంతి ఉత్సవాలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాక్రమెంటో(టీఏజీఎస్) వారి సంక్రాంతి ఉత్సవాలు

గణపతి పూజ తో సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. సుమారు 800 పైచిలుకు పాల్గొన్నఈకార్యక్రమంలో 150 మందికిపైగా పిన్నలు పెద్దలు పాటలు, నృత్యాలు, నాటిక ప్రదర్శించారు.  పెళ్ళిచూపులు కార్యక్రమం నుండి, పెళ్లి జరిగే వరకు జరిగే ప్రతి సంఘటన ను అందం గా కూర్చి వేదిక మీద సాంప్రదాయం గా ప్రదర్శించిన తెలుగు వారి ‘పెళ్లి’ ఆహుతులను విశేషంగా ఆకట్టుకొంది. ఈ సందర్భం గా “ప్రసాద్  పన్నాల, విజయలక్ష్మి  పన్నాల” గార్లు స్థానిక తెలుగు కుటుంబాలకు చెందిన ‘మనబడి’ చిన్న పిల్లలతో వేదిక పై అచ్చ తెలుగు లో వారి చేత మాట్లాడించారు. ఈ సందర్భం గా చిన్నారులకు గాలిపటాల తయారి పోటీ, ముగ్గుల పోటి, చిత్రలేఖనం పోటి, తెలుగు క్విజ్ నిర్వహించి విజేతలకు టీఏజీఎస్ కార్యవర్గం బహుమతులు అందజేశారు. ఈ సంక్రాంతి వేడుకలకు శివ ఎర్రమల్లి (వైస్ ప్రెసిడెంట్ ఇంటెల్ సంస్థ), సిలికానాంధ్ర చైర్మన్ ఆనంద్ కూచిభొట్ల ముఖ్యఅతిధులు గా విచ్చేశారు.

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాక్రమెంటో(టీఏజీఎస్) వారి సంక్రాంతి ఉత్సవాలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాక్రమెంటో(టీఏజీఎస్) వారి సంక్రాంతి ఉత్సవాలు

టీఏజీఎస్ సంక్రాంతి కార్యకమాలలొ భాగంగా సినీ సంగీత దర్శకులు రఘు కుంచె, గాయని ఉష, స్థానిక శాక్రమెంటో కు చెందిన ‘అభినవ ఘంటసాల’ రాజు ఇడూరి గారు నిర్వహించిన సంగీత విభావరి అందరినీ ఉర్రూతలూగించినది. అనేక వేలకిలోమీటర్లు దాటి అమెరికాకు వచ్చినప్పటికీ, తెలుగు వారి మనస్సులో వారి వారి తల్లిదండ్రులు, చిన్ననాటి స్నేహితులు, సొంత ఊరు జ్ఞాపకాలు నిరంతరం మెదులుతుంటాయి అని గుర్తు చేస్తూ రఘు కుంచె పాడిన “గుర్తుకొస్తున్నాయి”  పాట ఆహుతులను కదిలించింది. విజయ్ బాపినీడు  (eTV  వైస్ ప్రెసిడెంట్), జంపాల  చౌదరి (TANA ప్రెసిడెంట్  ఎలెక్ట్), పిన్నమనేని పాండురంగారావు  (లాంకో  CEO) తదితరులు శాక్రమెంటో తెలుగు వారికి ప్రత్యేకం గా  అందజేసిన సంక్రాంతి అభినందనల వీడియో రికార్డింగ్ ను వేదికపై ప్రదర్శించారు.

 

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాక్రమెంటో(టీఏజీఎస్) వారి సంక్రాంతి ఉత్సవాలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాక్రమెంటో(టీఏజీఎస్) వారి సంక్రాంతి ఉత్సవాలు

స్థానిక పీకాక్ రెస్టాంరెంట్ వారు పసందైన విందుభోజనం సమకూర్చగా, టీఏజీఎస్ కార్యకర్తలు ఆహుతులకు విందుభోజనం కొసరి కొసరి వడ్డించి అందరి మన్ననలను చూరగొన్నారు.  కాలిఫోర్నియా శాక్రమెంటో లో సంక్రాంతి వేడుకలు విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు స్వర్ణ కంభంపాటి,అశ్విన్ తిరునాహరి, గిరి తాతిపిగారి, రాంబాబు బావిరిశెట్టి, మల్లిక్ సజ్జనగాండ్ల, వెంకటేశ్వరరావు నాగం, సుధాకర్ వట్టి తదితరులు, టీఏజిఎస్ కార్యకర్తలు వాసు కుడుపూడి, అనిల్ మండవ తదితరులు  ఉన్నారు. మీడియా కవరేజికి విచ్చేసిన TV5, స్థానిక IndiaSpotlight , news 10 ఛానల్ కు టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు ప్రత్యేక అభినందనలను తెలియజేసారు.

 

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాక్రమెంటో(టీఏజీఎస్) వారి సంక్రాంతి ఉత్సవాలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాక్రమెంటో(టీఏజీఎస్) వారి సంక్రాంతి ఉత్సవాలు

స్థానిక తెలుగు కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్ధులు “సందీప్  గుర్రం, తేజ చలంచెర్ల, సంజయ్ రావి, కేతన్ సొమవరపు, రోహన్ అట్లూరి” కు టీఏజీఎస్ నిర్వాహకులు వేదికపై అవార్డులను అందజేశారు.  రాబోవు నెలలలో మరిన్ని టీఏజీఎస్  కార్యక్రమాలు జరుగుతాయి అని,  మరింత సమాచారం కోసం టీఏజీఎస్ ను ఈమెయిలు telugusac@yahoo.com  లో సంప్రదించాలి అని టీఏజీఎస్ కార్యవర్గం ప్రకటించింది. కాలిఫోర్నియా లో తెలుగు వారి అచ్చ తెలుగు పండుగ ‘సంక్రాంతి’  వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసి, ప్రపంచం నలుమూలల తెలుగువారి వైభవాన్ని చాటిన చిన్నారులను, పెద్దలను, రాత్రింబగళ్ళు కష్ట పడి సహకరించిన వాలంటీర్లను, అలాగే విరివిగా విరాళాలు అందజేసిన సంస్థలు తదితర వారందరికీ  తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాక్రమెంటో కార్యదర్శి అశ్విన్ తిరునాహరి  పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసారు.

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాక్రమెంటో(టీఏజీఎస్) వారి సంక్రాంతి ఉత్సవాలు (36) తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాక్రమెంటో(టీఏజీఎస్) వారి సంక్రాంతి ఉత్సవాలు (35) తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాక్రమెంటో(టీఏజీఎస్) వారి సంక్రాంతి ఉత్సవాలు (34) View more photos here [nggallery id=18]

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →