Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telugu Ghazal: ఒక్క కబురు చాలు కదా..నే వాగై పొంగేందుకు..!

By   /  November 5, 2016  /  No Comments

    Print       Email

fb_img_1475721062728

ఒక్క చూపు చాలు కదా నే పాటై కురిసేందుకు..!
ఒక్క నవ్వు చాలు కదా..నే పువ్వై పూసేందుకు..!

InCorpTaxAct
Suvidha

చెప్పలేని వేదనలను రూపుమాపు మందేదో..
ఒక్క కబురు చాలు కదా..నే వాగై పొంగేందుకు..!

నీ తలపుల పరమాన్నం రుచి తెలిపే మాటలేవి..!?
ఒక్క అడుగు చాలు కదా.. నే చరితై మిగిలేందుకు..!

గాలికెంత దిగులో మరి నీ పేరే పలకాలని..
ఒక్క పిలుపు చాలు కదా..నే మెఱుపై విరిసేందుకు..!

చిత్రమైన అనుభవాల ఊసులన్ని మధురములే..
ఒక్క ముద్దు చాలు కదా..నే మబ్బై కదిలేందుకు..!

తేనెవాన నీ మౌనం అలరించే తీరేమో..
ఒక్క చినుకు చాలు కదా..నీ దివ్వై వెలిగేందుకు..!

Author: MadhavRao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →