Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telugu Ghazal: పరిమళిస్తూ రాలిపోవు..పూల బాలనైతె చాలు..!

By   /  January 3, 2017  /  No Comments

    Print       Email
hqdefaultఅదేపనిగ చదువుకునే ప్రేమ లేఖనైతె చాలు..!
పరిమళించు అందమైన తీపి ఊహనైతె చాలు..!
నీ హృదయపు కోవెలలో వెలుగు దీపశిఖ ఏదో..
చూస్తు అలా తేలిపోవు..పక్షి పాటనైతె చాలు..!
విరహమధువు గ్రోలుతున్న  తుమ్మెదలా ఎందుకిలా..?!
నీ వెలుగున ఆడుకునే..మబ్బు తునకనైతె చాలు..!
ఏ వాసన లేని పూలతీవలాగ బ్రతకటమా..!?
పరిమళిస్తూ రాలిపోవు..పూల బాలనైతె చాలు..!
మట్టిగుండె లయమాటున నిశ్చలమౌ ప్రాణసఖీ..
లాలనలకు అతీతమౌ..చెలిమి వీణనైతె చాలు..!
ఈ మాధవ గజల్ సొగసు చూడాలిక అరకన్నుల..
చెప్ఫరాని భావాలకు..ప్రేమమాలనైతె చాలు…!
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →