Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telugu Ghazal: ఏడుపంతా తొలగిపోవును..జ్ఞానచక్షువు తెరచి చూస్తే..!

By   /  January 3, 2017  /  No Comments

    Print       Email
shivaకోటి సూర్యుల కోవెలంటే..నుదుటి నేత్రమె తరచి చూస్తే..!
మరణమన్నది ఎక్కడున్నది..కన్నులారా నిలచి చూస్తే..!
ప్రమాదాలను సృష్టిజేసే..మనసు చిత్రము తెలియవేలా..
మంత్రతంత్రము లన్ని ముసుగులె..కాస్త శ్రద్దగ తలచి చూస్తే..!
గుండెలయలను అనుసరించే..విద్య ఏదో పట్టవలెనిక..
శ్వాస వీణను మీటు వేళ్ళను..చెలిమిమీరగ వలచి చూస్తే..!
మాయఖర్మము చుట్టుకున్నది..కర్మచక్రము లేదు విడిగా..
ఏడుపంతా తొలగిపోవును..జ్ఞానచక్షువు తెరచి చూస్తే..!
కలల పక్షుల విరహవేదన..తీర్చు హంసల గగనమదుగో..
నేను నాదను భావసంపద..మరచి హృదయము పరచి చూస్తే..!
గజల్ మాధవ అక్షరాలకు..అద్దమంటే మౌనవనమే..
జపము స్మరణలు ప్రయాసలేగ..రూపమోహము విడచి చూస్తే..!
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →