Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telugu Ghazal: మరిగే క్షణాల..మబ్బుల నదిలో..!

By   /  February 20, 2017  /  No Comments

    Print       Email

fb_img_1487254102654పాటల ఊయల..చూపుల నదిలో..!
ఊహల వెన్నెల..సొగసుల నదిలో..!

మనసున పొంగే..రాగం ఏదో..
మౌనపు కోవెల..మధువుల నదిలో..!

InCorpTaxAct
Suvidha

తనువే తియ్యని..ఆశల తీవగ..
అందిన అందెల..మెఱుపుల నదిలో..!

నవ్వీనవ్వని..అరవిరి మొగ్గలు..
వసంత కోకిల..వలపుల నదిలో..!

చిక్కని తరగని..ఆవిరి కొండలు..
మరిగే క్షణాల..మబ్బుల నదిలో..!

మాధవ గజలే..చుట్టే వేళల..
పదాల స్వరాల..వెలుగుల నదిలో..!

Author: Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →