Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telugu Ghazal

By   /  July 23, 2016  /  No Comments

    Print       Email

maalaabalaనీ నవ్వుల పూలదారి నడిపించే కలలు వద్దు..!

వాస్తవాన్ని అందించక కవ్వించే కలలు వద్దు..!
కోరికలకు గూడు కట్టి పెంచలేను ఏమాత్రం..!
నన్ను నాకు కాకుండా బంధించే కలలు వద్దు..!
ఆపదలో ఆదుకునే చెలిమికన్న కోరనేమి..!
మెలకువనే దోచుకొనగ కలహించే కలలు వద్దు..!
ఏ సంపద ఎంతున్నా నీ తోడే పెన్నిధి కద..!
అహంకార కిరీటాన్ని రక్షించే కలలు వద్దు..!
పరితపించు వేళలింక తాళలేను ఘడియైనా..!
అడుగడుగును గుచ్చిగుచ్చి వేదించే కలలు వద్దు..!
గజలు సొగసు వర్షించే మాధవుడా..చెప్పాలా..!
నీవుగాక మరి ఏమీ కనిపించే కలలు వద్దు..!
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →