Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telugu Ghazal

By   /  July 25, 2016  /  No Comments

    Print       Email

మేలిముసుగు మాటు నవ్వు దోచుకొనగ ఎవరి తరము..!?
తలపు వీణ రాగాలను నిలుపుకొనగ ఎవరి తరము..!?

మనసుపొరల కలల ఊట మధురమైన వెన్నెలయే..
చెప్పలేని ఊహలన్ని వ్రాసుకొనగ ఎవరి తరము..!?

InCorpTaxAct
Suvidha

ఏ గులాబి మొగ్గకుంది పరిమళించు స్వేచ్ఛ ఇచట..!?
అర కన్నుల మాటు కథలు పంచుకొనగ ఎవరి తరము..!?

సంప్రదాయ సౌరభాలు సంకెళ్ళుగ పరిణమించె..
అర్థరహిత కట్టుబాట్లు తెంచుకొనగ ఎవరి తరము..!?

సుఖశాంతుల సంపదలను ప్రసాదించు వారెవరట..?!
ఎదలోతుల చెలిమి పురము చేరుకొనగ ఎవరి తరము..!?

జీవితాన్ని అందమైన కావ్యముగా గుర్తించుట జరిగేనా..!?
ఈ మాధవ మాధుర్యం అందుకొనగ ఎవరి తరము..!?

Author:

Madhav Rao Koruprolu

13254167_896390973822258_3568960880258876080_n

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →