యుద్ధానికి కాలు దువ్వ..మనసు రాదు ఏవేళా..!
ప్రశాంతతను భంగపరచ..తలపు రాదు ఏ వేళా..!
కనులలోకి చూసేందుకు మైత్రి విలువ అందాలిగ..!
ఈ పహరా దీపాలకు..అలుపు రాదు ఏ వేళ ..!
మూతపడవు ఈకన్నులు కలనైనా ఎరుకమాని..!
అంతరంగ మౌనంలో..విసుగు రాదు ఏ వేళా..!
దేశరక్షణేమున్నది..విశ్వశాంతి నా లోకం..!
చిరునవ్వే ఆభరణము..ముప్పు రాదు ఏ వేళా..!
ప్రేమాక్షర మేఘాలను సృష్టించుట మన ధర్మం..!
జన్మవిలువ తెలుసుకున్న..ఉడుకు.. రాదు ఏ వేళా..!
విజయమేది లేదన్నది తెలిపే నీ మాధవుడే..!
సత్యానికి ఏ శక్తీ పడదు అడ్డు..రాదు ఏ వేళా..!
Author:
Madhav Rao Koruprolu
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.